‘కార్పొరేట్​’ ప్రేమపక్షులు మన పాలకులు

మది నిండా మీరే!

‘కార్పొరేట్​’  ప్రేమపక్షులు మన పాలకులు

ప్రజలపై ఓట్ల ప్రేమే!

‘కుర్చీ’పై ప్రేమతో కలిసి నడిచిన వాళ్లతో బ్రేకప్​

ఆదానీ, అంబానీ, మేఘా, మైహోం.. లతో  ఎల్లలు లేని ప్రేమ..


వేకువ ప్రతినిధి: రాజకీయాల్లో  ప్రేమ బంధాలు శాశ్వతంగా నిలబడడం లేదు.. ప్రేమలు..  బంధాలు.. విడిపోవడాలు సాధారణంగా ఉంటున్నాయి. ఎవరిపై  రాజకీయ ప్రేమలు శాశ్వతంగా ఉండవని మాత్రం గుర్తించాలి.  ప్రజలు, రాజకీయ నాయకుల మధ్య ప్రేమబంధాలు శాశ్వతంగా ఉండడం లేదు. మోడీనే  తీసుకుంటే దేశంపై ప్రేమ చాటుతున్నా.. ప్రజలకు మాత్రం ప్రేమకు సంబంధించిన ఫలితాలు కానరావడం లేదు.  ప్రజలపై ఆయనది కపటప్రమేమగానే చూడాలి. ఆదానీ,అంబానీ, కార్పోరేట్‌ శక్తులపై ఉన్న ప్రేమ బీజేపీలోని పెద్దలపై కూడా ఉండడం లేదు.  తాజాగా విశాఖ ఉక్కు కోసం ఫోక్సోతో  ప్రేమలో  పడ్డారు. అందుకే  తమను కూడా ప్రేమించాలన్న విశాఖ ఉక్కు కార్మికుల ను ప్రేమించే అవకాశం లేదని తెగగేసి చెప్పారు. ఆయనకు డిజిన్వెస్ట్‌మెంట్‌ విూద ప్రేమ ఎక్కువ. ప్రైవేట్‌ రంగంపై ప్రేమ ఎక్కువ. వారంతా బాగా బలపడితే అంతకన్నా ఆనందం ఉండదన్న ఆశతో ప్రేమలో పడ్డారు.  ప్రభుత్వరంగాలపై అందుకే ప్రేమను వదులు కుంటున్నారు. ఆయనకు ఎల్‌ఐసీ కన్నా దానిని కొనుగోలు చేసేవారిపై ప్రేమ ఎక్కువ...టాటాల విూద ప్రేమతో ఎయిరిండియాను మళ్లీ వారికే అప్పగించి విశాల హృదయాన్ని చాటుకున్నారు.  అంతెందుకు తనను తీసుకుని వచ్చి.. గద్దెనెక్కించిన అద్వానీపైనే  ప్రేమను శాశ్వతంగా వదులుకున్నారు. తనను కాపాడి.. రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకుని వచ్చినా సరే ఆయనకు అద్వానీ అంటే ప్రేమ లేదని రుజువు చేసుకున్నారు.. ఎందుకంటే పదవిపై ప్రేమ కారణం గా అద్వానీ లాంటి వారిని రాష్ట్రపతిని చేసే అవకాశం ఉన్నా పక్కన పెట్టారు.  అలాగే మురళీ మనోహర్‌ జోషి తదితర నేతలను కూడా ప్రేమగా పక్కన పెట్టేశారు.  కారణం.. వారంతా పెద్దవాళ్లు అయ్యారు కనుక ఇంటికే పరిమితం చేశారు. ఇప్పుడు అమిత్‌షాతో కొనసాగుతున్న ప్రేమకారణంగా ఇద్దరూ కలసి మనదేశ కార్పోరేట్‌ దిగ్గజాలతో ప్రేమలో పడ్డారు. అందుకే తాను ప్రేమించిన సాగు చట్టాలను పట్టాలకు ఎక్కించేం దుకు రైతులను ఏడాదిగా ఆందోళనకు గురిచేశారు. అలాగని వారిపై ప్రేమ నటించడం కూడా ప్రధాని మోడీకి ఇష్టం ఉండదు.  అలాగే తన ప్రేమ అంతా రైతులకోసమే అని చెప్పడం ద్వారా వ్వయసాయ చట్టాల అమలు కోసం ప్రేమపెట్టి పనిచేస్తున్నానని చెప్పి..వారు దారికి రాకవపోవడంతో రద్దుచేయడం ద్వారా ప్రేమను చాటారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయనపై ప్రజలు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో  మార్చిలో తెలియనుంది. రాజకీయంగా ఎవరికి వారు తమ రాజకీయ ఎత్తుగడలతో కూడినే ఇతరులను ప్రేమిస్తున్నారు. దానివల్ల కలిగే లాభాన్ని, ప్రయోజనాలను మాత్రమే ప్రేమిస్తుంటారు. రాజకీయ నాయకుల ప్రేమలు అయితే పలు రకాలుగా ఉంటుంది. అవసరాల మేరకు ఇతరులతో తమకున్న ప్రేమలను మార్చేస్తుంటారు. ప్రధానంగా ప్రభుత్వాలకు ప్రజలపై ప్రేమ ఉండడం లేదు. అంతా స్వార్థంతో కూడిన ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. వారిది ఓట్ల ప్రేమ తప్ప మరోటి కానరాదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను చూస్తుంటే ప్రజలపట్ల అన్ని పార్టీలు ప్రేమలు ఒలకబోస్తున్నాయి. ఎన్నికల ముందున్న ప్రేమలు ఎన్నికలయ్యాక నిలబడడం లేదు.  

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎలా ఉన్నా మోడీపై  ప్రేమానురాగాలతో ఏడేళ్ల బంధం కొనసాగించారు.  కానీ ఏడేళ్ళ తరవాత కేసీఆర్‌ ఇప్పుడు మోడీ ప్రేమ అంతా ఉత్తిదే అని తేల్చారు.  సీఎం కేసీఆర్‌కు మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వరరావుతో పాటు, తన కుటుంబీకులపై అవ్యాజమైన  ప్రేమ ఉంటుంది. వారు చేపట్టే పనులపై ప్రేమను పెంచుకుంటారు. అలా వారికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ప్రేమను చాటుకోవడం ఆయనకు సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎందరితోనే ప్రేమగా ఉన్నా వారినందరిని తన ప్రేమకు దూరం చేసుకున్నారు. తాజాగా మోడీతో కూడా ప్రేమబంధాన్ని తెంచు కున్నారు. ఇకపోతే పాలకులు అందరికీ ప్రైవేట్‌ విద్యాసంస్థలతోనే ప్రేమ ఎక్కువ. వారి ప్రేమలో పడి అందరినీ మర్చి పోతారు. ఫీజుల కొరడా ఝళిపిస్తున్న తరుణంలో వస్తున్న ఆర్తనాదాలు వినపడవు. ప్రేమ మైకంలో వారంతా ఇలాంటి వాటిని పట్టించుకోరు. అందుకే ఇటీవల కరోనాతో స్కూళ్లు నడవకున్నా.. క్లాసులు జరగ కున్నా కేజీ నుంచి పీజీ వరకు ముక్కుపిండి ఫీజులు కట్టించుకుంటున్నా ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. వీరి రాజకీయ ప్రేమలు ఇలా ఎంతకాలం ఎలా ఉంటాయో కూడా వారికే తెలియదు. రాజకీయ ప్రేమికులారా విూ విశాల హృదయానికి నమో వాక్కులు!

Relative Post

Newsletter