మిర్చి తో ప్రభాస్‌కు, కొరటాలకు బిగ్గెస్ట్‌ హైప్‌


మిర్చి తో ప్రభాస్‌కు, కొరటాలకు బిగ్గెస్ట్‌ హైప్‌

బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన మిర్చి చిత్రం విడుదలై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. ఈ చిత్రం 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ద్వారా ఇప్పుడు చిత్ర దర్శకుడు కొరటాల శివకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ చిత్రంతోనే శివ స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. చిత్రంలో ప్రభాస్‌ అటు క్లాస్‌గా ఇటు మాస్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రభాస్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌కే సెపరేట్‌గా ఫ్యాన్స్‌ ఉన్నారు. రెబల్‌ వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత ప్రభాస్‌కు సాలిడ్‌ కంబ్యాక్‌ ఈ చిత్రం ఇచ్చింది. ఈ సినిమాతో కొరటాల శివ రచయిత నుండి దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మొదటి చిత్రంగా మిర్చి తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా అనుష్క, రిచా గంగోపాధ్యాయలు హీరోయిన్లుగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలైతే అప్పట్లో శ్రోతల చెవులలో మార్మోగిపోయాయి. 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజీటీవ్‌ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామిని సృష్టించింది. 


Newsletter