తెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం

తెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం 

2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి . ఇంకా 20 నెలల కాలం ఉంది .గతంలో ఆరు నెలల ముందు నుండి లేకపోతే ఎక్కువలో ఎక్కువ ఒక సంవత్సరం ముందు నుండి ఎన్నికల కార్యక్రమాలు మొదలయ్యేవి . ఇప్పుడు చాలా ముందు నుండే ఎన్నికల కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు . బిజెపి లాంటి పార్టీ అయితే తను లక్షంగా పెట్టుకున్న రాష్ట్రంలో ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు నుండే తన ఎన్నికల ఎజెండాను అమలు చేస్తున్నది . ఇప్పుడు తెలంగాణలో కూడా 20 నెలల ముందు నుండె అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయడం మొదలుపెట్టాయి .

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి మూడవ అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి .  రెండు సార్లు టిఆర్ఎస్ గెలిచి అధికారానికి వచ్చింది . అయితే ఇప్పుడు మొదటి రెండు ఎన్నికలలో గెలిచినంత సులువుగా గెలిచే అవకాశం టిఆర్ఎస్ కు లేదు . మొదటిసారి తెలంగాణ కొరకు పోరాడిన పార్టీగా టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు . ఎన్ని అవకతవకలు ఉన్నా తెలంగాణ గతం కంటే అభివృద్ధి చెందింది . విద్యుత్ కొరతను అధిగమించింది . ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వాల కంటే ఎక్కువ ఖర్చు చేసింది చేస్తున్నది . అలాగే అధికారంలో ఉండడం వలన లభించే అనుకూల అంశాలను కూడా టిఆర్ఎస్ ఉపయోగించుకున్నది . ఇవన్నీ టిఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి.  తెలంగాణ మొదటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీని ఇచ్చింది.  కాని రెండవ సారి మాత్రం పొత్తుల ఎత్తుగడలు అవలంబించినా అధికారం తీరానికి చేరుకోలేకపోయింది . మొదటిసారి కంటే మెరుగైన ఫలితాలు ఏమీ సాధించలేదు . ఇక బిజెపి ఎన్ని బీరాలు పలికినా పలుకుతున్నా తెలంగాణ అసెంబ్లీలో రెండు మూడు సీట్ల పార్టీగానే ఉండిపోయింది . ఆర్థిక పోరాటాల సందర్భంగా భుజం భుజం కలిపి పోరాడే కమ్యూనిస్టు పార్టీలు సరిగ్గా ఎన్నికల ముందు  ఎవరి దారిన వారే ఏదో ఒక బూర్జువా పార్టీతో పొత్తుకు దిగుతున్నారు . అధిక ధరలకు వ్యతిరేకంగా మాత్రమే పోరాడే పార్టీలుగా గుర్తింపు తెచ్చుకోవడం వలన ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు .

అయితే ఈ సారి పరిస్థితులు గతంలో లాగ లేవు టిఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వలన సహజగానే  వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది . టిఆర్ఎస్ చేసిన వాగ్దానాలు అన్ని అమలు చేయలేదు . డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లాంటి విషయంలో చేసిన ప్రచారానికి అనుకూలంగా అమలు జరగలేదు . చాలామంది తమకు వస్తాయని అనుకున్నారు కానీ చాలా పరిమితంగానే ఇచ్చారు . ధరణి కూడా ఒక తీవ్ర సమస్యగా తయారయింది . దాదాపు ప్రతి గ్రామంలో ధరణి లో భూముల వివరాలు తప్పుగా  రికార్డు చేయబడ్డాయి . దీనివలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . ప్రజలు ఊహించిన అంచనాలకు అనుకూలంగా టిఆర్ఎస్ ప్రదర్శన లేదు . ప్రజలు ఇచ్చిన హామీల అమలుకు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇవ్వరు . ఈ పది సంవత్సరాలలో ఇచ్చిన హామీల లో ఎన్ని అమలు చేశారనేది చూస్తారు ప్రజలు . దాని ఆధారంగానే ప్రజల వ్యతిరేకత ఉంటుంది.టిఆర్ఎస్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎవరికివారు ఉపయోగించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి . అందుకే ఈ పార్టీలు చాలా ముందు నుండే ఎన్నికల కార్యక్రమాలను మొదలుపెట్టాయి. బిజెపి తెలంగాణా ఏర్పడినప్పటి నుండి తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నది . కానీ తెలంగాణలో వారి బలం ఎంత నామమాత్రమో అందరికంటే ఎక్కువగా వారికే తెలుసు . అందుకే బిజెపి తన సొంత బలం పై ఆధారపడి గెలిచే అవకాశం లేనందున ఇతర పార్టీలోని అసంతృప్తి నాయకులను ఇతర సెలబ్రిటీలను బీజేపీలో చేర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని , కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థల ద్వారా ఇతర పార్టీల నాయకులను బిజెపీలో చేరేలా ఒత్తిడి చేస్తున్నదని బీజేపీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కూడా . తెలంగాణాలో ఎటువంటి ఎత్తుగడలు అవలంభించాలో బీజేపీకి అర్థం కావడం లేదు . బిజెపీ పాలిత రాష్ట్రాలు ఏవి కూడా తెలంగాణ కంటే గొప్పగా లేవు . మేము అధికారంలోకి వస్తే , మేము అధికారంలో ఉన్న రాష్ట్రం లా అభివృద్ధి చేస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు . అందుకే బిజెపి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పైన చేస్తున్న విమర్శలనే తెలంగాణాలోనూ చేస్తున్నది . టిఆర్ఎస్ కుటుంబ పార్టీ అనీ , దానిది కుటుంబ పాలన అని విమర్శిస్తున్నది . తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం వాటా ఉన్నదనీ , కేంద్రం నిధులు ఇవ్వడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి అయ్యిందని చెప్పుకుంటున్నది . ప్రజలు వీటిని పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు . బిజెపి నాయకుల పిల్లలు కూడా రాజకీయాలలోకి చాలామందే వచ్చారు వస్తున్నారు .  కేంద్రం నిధుల వల్లనే తెలంగాణ అభివృద్ధి అయితే , బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి . కానీ అలా లేవు . అందుకే బిజెపి మరోసారి పాదయాత్ర మొదలు పెట్టింది . బండి సంజయ్ ఇంతకుముందు కూడా ఒక పాదయాత్ర చేశాడు కానీ జనం పట్టించుకోలేదు . ఈ సారి పెద్ద ఎత్తున ప్రచారం చేసి , ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి పాదయాత్ర మొదలు పెట్టాడు . బిజెపి పెద్ద నాయకులు వస్తారని కూడా చెప్పుకున్నారు . కానీ ఇప్పుడు  కూడా తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు . అసలు బీజేపీ వద్ద తెలంగాణాలో నాయకుడే లేడు . దానికి తగ్గట్లుగా అంతర్గత గొడవలు బహిర్గతం అవుతున్నాయి . ఎన్నికలు  దగ్గర పడే కొద్దీ ఈ గొడవలు ఇంకా పెరగవచ్చు . ఇక బీజేపీ వద్ద ఉన్న ఆఖరి బాణం , ఆయుధం మతతత్వం . మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి బిజెపి దానిని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ దాని కుటుంబ సంస్థ హిందూ వాహిని లాంటి సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి . మత కలహాలను విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం టిఆర్ఎస్ కు ప్రమాదం తప్పదు . మొత్తం తెలంగాణా నే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది .

వాస్తవానికి తెలంగాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే పునాది . బలం ఎక్కువ . అన్ని జిల్లాలలో ఆ పార్టీ ఉన్నది దానికి నాయకులు ఉన్నారు . ఎక్కువ మంది నాయకులు ఉన్నారు . అదే కాంగ్రెస్ పార్టీకి సమస్య కూడా  .అందరూ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు కావాలనుకుంటారు . ఈ అంతర్గత గొడవలు తోనే మొదటి అసెంబ్లీ ఎన్నికల లో అందరు నాయకులు కలిసి ఐక్యంగా టిఆర్ఎస్ ను ఎదుర్కొనలేక పోయారు . రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ పార్టీ దివాలా తీసిన పార్టీగా తయారయింది . చాలామంది నాయకులు ఇతర పార్టీలలోకి వలసలు పోయారు . చివరికి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది . రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో కదలిక వచ్చింది . టిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ సభలలో ప్రజల సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతున్నది. అయినా అధిష్టానం సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నా ఆ పార్టీలో అంతర్గత కలహాలు అంతం కావడం లేదు ఈ సమస్యలన్నీ ఉన్నా టిఆర్ఎస్ పై పెరుగుతున్న వ్యతిరేకతను  ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ కూడా ముందే రంగం లోకి దిగింది . సభలు సమావేశాలు మొదలు పెట్టింది . మే నెలలో వరంగల్ లో పెద్ద బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల శంఖం ఊదబోతున్నది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ కేంద్ర నాయకులు తెలంగాణకు వస్తారని కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తారని చెబుతున్నారు . నిజంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ సమస్యలను వెంటనే పరిష్కరించి , ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల బరిలోకి దించగలిగితే కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది . బిజెపి కంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి . ఆ పార్టీ అంతర్గత ఐక్యత పైన , కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లలో కల్పించే విశ్వాసం పైన కాంగ్రెస్ పార్టీ  విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి . 

బిజెపి కాంగ్రెస్ పార్టీ లే కాదు టీఆర్ఎస్ కూడా ఎన్నికల బిగుల్ ఊదింది . హనుమకొండ లో కేటీఆర్ బహిరంగసభతో టీఆర్ఎస్ ఎన్నికల సమరం ప్రారంభించింది . ఈ ఎన్నికల సమరంలో భాగంగానే ఈ బహిరంగ సభ తర్వాత కేటీఆర్ ప్రముఖమైన టీవీ ఛానల్ లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు . కేటీఆర్ సభలోనూ ఇంటర్వ్యూల్లోనూ టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ బీజేపీ పాలిత , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇటువంటి అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు . కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్రం పెత్తనాన్ని విమర్శిస్తున్నాడు . అయితే మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను టిఆర్ఎస్ సమర్ధించింది . ఇప్పుడు విమర్శించడం వలన ప్రజలు టిఆర్ఎస్ మాటలను అంత సులువుగా నమ్మడం కష్టమే. బీజేపీ మతతత్వ గురించి కూడా టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు . కానీ ఎక్కువగా తన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించే ప్రచారం చేస్తున్నది . టిఆర్ఎస్ కేవలం ఇవి ప్రచారం చేసుకోవడం వలన బీజేపీని ఎదుర్కోలేదు . మతతత్వానికి వ్యతిరేకంగా నిర్దిష్టమైన నిర్మాణాలు కార్యక్రమాలు లేకుండా బీజేపీ మతతత్వాన్ని  టిఆర్ఎస్ ఎదుర్కోలేదు.  చాలా మంది టిఆర్ఎస్ నాయకుల పైన ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న  ఎమ్ ఎల్ ఎ లకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఇతర పార్టీలలోకి ముఖ్యంగా బీజేపీ లోకి పోయే అవకాశం ఉంది . బిజెపి నాయకులు టచ్ చేయని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేరు అంటే అతిశయోక్తి కాదు . ఎన్నికలకు ఇంకా 20 నెలలు ఉన్నందున ఇప్పుడే ఎవరు టిఆర్ఎస్ ను వదలరు కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ  వలసలు పెరిగే అవకాశం ఉన్నది . ఈ సమస్యలన్నీ టిఆర్ఎస్ పరిష్కరించుకో గలిగితే మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు . కానీ టిఆర్ఎస్ కు అనుకూల పరిస్థితుల కంటే అననుకూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి . కనీసం గత ఎన్నికలలో ఉన్న అనుకూల పరిస్థితులు లేవు . 

మొత్తంగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ , బీజేపీలు తెలంగాణా లో మూడవ అసెంబ్లీ ఎన్నికల కొరకు క్యాంపెయిన్ ను మొదలు పెట్టాయి . ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . అయితే ఈ సంవత్సరం లోనూ వచ్చే సంవత్సరం లోనూ జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు . ఈ సంవత్సరం చివరిలో జరిగే గుజరాత్ ఎన్నికలు , వచ్చే సంవత్సరం లో జరిగే కర్ణాటక , మధ్యప్రదేశ్ , చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రదర్శన మంచిగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ కు ఉపయోగపడవచ్చు . కనీసం మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గడ్ లో తిరిగి గెలిచినా అది అనుకూలంగా పని చేయవచ్చు . ఇంకా 20 నెలలు ఉన్నందున ఇప్పుడే స్పష్టంగా అంచనా వేయడం కష్టమే . రాబోయే పది నెలల్లో జరిగే పరిణామాలు ఈ పార్టీల కార్య కలాపాలు , కృషి మొత్తం పరిస్థితిని వేరే విధంగా కూడా మార్చి వేయొచ్చు . అప్పటివరకు వేచి చూడాల్సిందే .

Relative Post

Newsletter