వీరమాత ఎర్రంరెడ్డి అనసూయమ్మ గారికి జోహార్లు

వీరమాత ఎర్రంరెడ్డి అనసూయమ్మ గారికి జోహార్లు 

కడివెండి వీరమాతల్లో ఒకరు ఎర్రంరెడ్డి అనసూయమ్మ గారు తన తొంబై ఏడవ ఏట సోమవారం మధ్యాహ్నం హైదరాబాదులో  మ్రతి  చెందారు.  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రోజుల నుంచి, ఇటీవల ఆరోగ్యం క్షీణించేదాకా ఆమె పోరాటశక్తులతోనే ఉన్నారు. 1999 డిసెంబర్ లో ఎన్ కౌంటర్ లో అమరుడైన అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్రకమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేష్) ని కన్నతల్లి ఆమె. గోర్కీ అమ్మ వంటి అమ్మ అనసూయమ్మకు కన్నీటి జోహార్లు అంటూ  విరసం నేతలు నివాళులు అర్పించారు. మాజీ మావోయిస్టు జినుగు నరసింహారెడ్డి, పీడీెఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయలు పరశురాములు, రాష్ట్ర నాయకులు రియాజ్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విజయ్ ,క్రాంతి, రాము, సాగర్ ,రవిచంద్ర, భవాని, బాలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు

Newsletter