తెలంగాణ బిల్లు సంగతి బండికి తెలుసా..?

తెలంగాణ బిల్లు సంగతి బండికి తెలుసా..?

మండిపడ్డ మాజీ ఎంపి వినోద్‌ కుమార్‌

కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ చేసిన విమర్శలకు వినోద్‌ కుమార్‌  ప్రతిస్పిందించారు. బండి సంజయ్‌కు ఏబీసీడీలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్‌కు అవగాహన ఉందా అని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్‌పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సంజయ్‌ ఎక్కడున్నాడని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రేకొట్టింది కాంగ్రెస్‌ ఎంపీలేనని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ నేత సుస్మా స్వరాజ్‌ మాట్లాడిన తర్వాత కూడా చర్చ జరగలేదని మోదీ ఎలా అంటారని ఆయన నిలదీశారు. ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి బండి సంజయ్‌ మాట్లాడగలడా అని ఆయన సవాల్‌ విసిరారు.

Relative Post

Newsletter