రేవతి దర్శకత్వంలో కాజోల్ సినిమా షూట్
రేవతి దర్శకత్వంలో కాజోల్ సినిమా షూట్
సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సలామ్ వెంకీ. బిలైవ్ ప్రొడక్షన్స్, టేక్23స్టూడియోస్ బ్యానర్లపై సూరజ్‌సింగ్, శ్రద్దా అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు షూటింగ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కాజోల్ ’అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ సోషల్ విూడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.