కాకతీయుల ను కొలువలెను! నిజాం కు సలాం గొట్టాలెను!
తెలంగాణ అంటే రాజులా??నిజామా??జనమా??
ఎవ్వడి ధుంఖం తెలంగాణై గడ్డ కట్టింది??
ఎవ్వడి చెమట చుక్క తెలంగాణై రూపు కట్టింది??
ఎవ్వడి బతుకును చావు జేసినపుడు ఎవడు అడవిని కుంపటి చేసిండు??
ఎవడు కొండలు మండించిన కోమురంభీం..
ఎవడి శిరస్సు తెగి భూమిని ముద్దాడింది?
ఎవడి నెత్తురు సూర్యబింబమై వికసించింది??
ఎవడు ఖండఖండమైనా ఖడ్గానికి తొడగొట్టాడు?
ఎవడు మృత్యవును పరిహాసించాడు?
ఎవడు యుద్ధమై పరిమలించాడు??
ఎవడు గింజయిండు??
ఎవడు గంజికి దూరమైయ్యాడు??
ఎవడు రాజును మోసాడు??
ఎవడు కోటను ఎత్తిపట్టాడు??
ఎవడు రాజరికాపు విలాసాల్లో కోవత్తయుండు??
ఎవ్వడు కాకతీయ వైభవపు ముడిసరుకైన్డ్?
ఎవడు దున్నిన దుక్కిఅయిండు??
ఎవ్వడు మొక్కై ండు??
ఎవడు రాజ్యానికి జీవ శక్తి అయిండు??
ఎవడు పగలుగు -రాత్రి కి కాపాలైండు??
ఎవడు ఆకలైండు??
ఎవడు అసహాజ మరణమయ్యాడు??
ఎవడు యవ్వన నగార మోగించాడు??
ఎవడు పెను మంటల పంటయ్యిండు??
ఎవడు తనువు తనువంతా తరంగామై ఎగిసాడు??
ఎవడు బొట్టు బొట్టు గా బతుకును పిండాడు??
ఎవ్వడు బందైనడు??ఎవడు భాష కు బతుకిచ్చాడు?
ఎవడు దళారి సర్వాల్చర్ మంగట్టన్??
ఎవడు ద్రోహగీతం పాడాడు??
ఎవ్వడు తెల్లోడి ఎల్ల గుర్రామైండు??
ఎవ్వడు ఘర్ ఘర్ దేశ భక్తుడయాడు??
ఎవడు యెత్తుపల్లమయ్యాడు?
ఎవడు మట్టి మట్టి గా పుట్టుకొచ్చాడు??
ఎవడు కత్తుల బోనులోనుండి ఈగివచ్చాడు??
ఎవడు కరకట్టయి నిలిచాడు??
ఎవడు ఎన్ను పూసల పట్టాలేసాడు??
ఎవడు జలపాతమై పోయాడు??
ఎవడు పల్లెర్ల పాదమయ్యాడు??
ఎవడి వీపు బండై బొందల పడ్డది??
ఎవడి గోర్లు రక్తాలు గక్కి రకం కత్తినై..??
ఎవడు తల్లి పాలు పంటేరువు జేసిండు??
తెలంగాణ సంస్కృతి రాజులదా??
రక్తం గడ్డకట్టిన కాళ్ళదా??
తెలంగాణ చరిత్ర ప్రభువులదా... రాజులదా..
నిజాము దా.. నేటి దొర పాలకులదా..??
ప్రజాలదా???
కాకతీయ నుండి ..నిజాం ..రాజకారు ,భూస్వామి మువ్వన్నెల రూపాన్ని బయట పడ్డ పేగుల ఆదిమిపట్టి తెలంగాణ జబ్బ జర్సింది..
కొండల ఢీ కొట్టింది...
మైళ్ళ మైళ్ళ విముక్త ప్రాస్తానంలో లక్షల ఎకరాల్లో చుక్కలు మొళిపించింది. దున్నేవానికి భూమని దేశాన్ని ఫిలించింది.
నాగేటి చాళ్ళలో నవదృక్కులు నాటింది...
అనుభావల పొత్తిల్లలో ఆయుధ పాఠాలు వింది..
దొర !
నీ బాంచనైత!!
కాకతీయుల ను కొలువలెను!
నిజాం కు సలాం గొట్టాలెను!!
నీ నిజాయితీకి మొక్కుతా!!
కాకతీయులది..నిజాం ది నీది ఇయాల్టీ సాయితా!?
పునాది దోర్కబట్టి పుర్సత్ గా పుట్టు పూర్వోత్తరాలకు దండం బెట్టమంట నవ్!!
బంగారు తెలంగాణ తెలంగాణ నిర్మాణమని
ఇస్తాంబుల్ సినిమా జూపిత్తానవ్!!
-వడ్డెబోయిన శ్రీనివాస్