మాకు ఆక్సిజన్ లాంటిదని భావిస్తూ.. కృతజ్ఞతలు.

"నీవు చెప్పేదానిలో ఒక్క మాటను కూడా నేను అంగీకరించను. కానీ ఆ మాట చెప్పడానికి నీకుగల ఆ హక్కును ప్రాణమిచ్చయినా సమర్ధిస్తాను" అని 18 వ శతాబ్దంలో వోల్టేర్ చెప్పిన మాటలకంటే ప్రజాస్వామ్య స్పూర్తిని చాటే మాటలు వేరేవి లేవేమో...ప్రపంచంలోనే అతిపెద్ద 'ప్రజాస్వామ్యంగా" మన దేశాన్ని చెప్పుకుంటారు. సహనశీలమైన సంస్కృతి అని పేరుంది. అయితే ఇపుడు భిన్నాభిప్రాయం పట్ల, ప్రశ్నలపట్ల రోజురోజుకు పెరుగుతున్న అసహనం, దాడులు, అక్రమ కేసులు, జైళ్లు  నిజంగా ఆందోళన కలిగించే విషయం. మొత్తం మానవజాతి అంతా కలిసి సంయుక్తంగా ఒక పతాకాన్ని రూపొందించుకుంటే ఆ పతాకంపై చిహ్నంగా "ప్రశ్న" నే వుంచవలసివస్తుంది. ఎందుకంటే ప్రశ్న లేకపోతే మానవజాతి ఒక్క అంగుళం కూడా పురోగమించేది కాదు. "మనం తుపాకుల్ని ఎదుర్కోగలం గానీ నియంతలు ప్రశ్నలను ఎదుర్కోలేరు" అంటాడు కవి. ప్రశ్న ప్రజాస్వామ్యానికి  శ్వాస ,ప్రశ్నల్ని, భిన్నాభిప్రాయాన్ని సహించలేని వాతావరణంలో ప్రజాస్వామ్యం ఉనికి సాధ్యం కాదు. ప్రశ్నించే వాతావారణాన్ని రక్షించుకోవడం ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తులంతా చేయాల్సిన పని.  అయితే మేము ఈ ప్రకృతి నుంచి ... పరిసరాల నుంచి మా చుట్టువున్న సమాజం నుంచి గ్రహించిన, నేర్చుకున్న  సామాజిక స్పృహ నుంచి మేము ఒక వాహిక గా చిరు ప్రయత్నం గా మా టీం నేటి డిజిటల్ సమాచార విప్లవంలో తెలంగాణ భౌగోళిక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక మౌలిక అంశాలపై ఫోకస్ చేస్తూ నిరంతరం వికసించే భావాలలోకి.. ఆచరణలోకి.. "కలం వేకువ" మేలుకొల్పేందుకు మీ ముందుకు తీసుకువస్తున్నాము.   సమాచారం కోసం,జ్ఞానం కోసం వెంపర్లాడాలని వాటికొరకు అంతర్జాల వలయంలో చిక్కుకు పోతున్న  యువతరానికి సమాచారమంతా జ్ఞానం కాదని జ్ఞానమంతా వివేకం కాదని మోరల్స్, పాజిటివ్స్ ని "కలం వేకువ" ఈ పేపర్, వెబ్ సైట్, ‘‘వేకువ న్యూస్’’  తెలుగు సమాజం ముందుకొస్తున్నది.  ఒక భిన్నమైన, పాజిటివ్ సమాచారం అందివ్వాలనే ప్రయత్నం లో మా ఫస్ట్ బ్రేక్ త్రు మీ చేతుల్లో ఉంది.  మెరుగు పరుచుకోవడానికి నిరంతరం సిద్ధంగానే వుంటుంటాం. సంచికలోని విభిన్న వ్యాసాల్లో, అంశాల్లో వ్యక్తమైన రచయితల అభిప్రాయాలు పూర్తిగా వారివే అని గమనించాలని యధావిధి మనవి.

మీ

బి.దుర్గాప్రసాద్

Relative Post

Newsletter