కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్

కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్

బెల్లంపల్లి అధికారులకు మెమో

 వేడుకలకు హాజరు కాలేదని కారణం

దేశ సేవకులకే దిక్కు లేదు...జాతి ని వుద్దరించిన నేతా...?

పోరాడి సాధించుకున్న తెలంగాణ లో ఉద్యమ స్పూర్తికి పాతర..ఫ్యూడల్ సంస్కృతి కి పట్టం..!


మంచిర్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఐటి&పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలకు బెల్లంపల్లి మునిసిపల్ కౌన్సిల్ కార్యాలయా అధికారులు హాజరు కాలేదన్న కారణం తో  జిల్లా అదనపు కలెక్టర్ మెమో జారీచేశారు.,వివరాలు ఇలా ఉన్నాయి. 24.07.2022 న  పురపాలక కమిషనర్ ఆదేశాల మేరకు మునిసిపల్ మంత్రి K. తారకా రామ రావు యొక్క పుట్టినరోజు వేడుకలు 10.00 గంటలకు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారని పేర్కొన్నారు.ఈ వేడుకలకు ప్రభుత్వ అన్ని కార్యాలయల సిబ్బంది పాల్గొనాలని Whatsapp సందేశం ద్వారా సమాచారం ఇచ్చినట్లు మెమో లో పేర్కొన్నారు. కానీ ఈ ఆదేశాలను  ఉద్యోగులు కొందరు కతరు చేయలేదని తక్కువ మంది హాజరై కార్యక్రమ ఫెయిల్ అయిందని పేర్కొన్నారు.కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదనిమునిసిపల్ అధికారులు T. రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ 2) ఎస్. పన్నాంచర్, జూనియర్ అసిస్టెంట్ 3) ఎ. మోహన్, సిస్టమ్ మేనేజర్ కు అదనపు కలెక్టర్ మెమో జారి చేశారు. పైన పేర్కొన్న కేటీఆర్ బర్త్ డే వేడుకలకు హాజరు కానందుకు మీపై చర్య ఎందుకు తీసుకోకూడదో ఈ మెమో అందిన  (24) గంటల్లో ఈ మెమోకు జవాబు ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే, మీపై క్రమశిక్షణా చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు.ఈ మెమో పై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నది.ఇదేమన్నా రచరికమా... దేశ సేవకులకే వేడుకలకు గుర్తింపు దిక్కు లేకుండా వున్న స్థితిలో మంత్రి తెలిపారు జాతి ఉద్దరాకూడా..ఇటువంటి చర్యలు దొర తనము కు నిదర్శనమైతే కావొచ్చు కానీ..ప్రజాస్వామ్య ము లో ఇవి తగవని హక్కుల సంఘాల నేతలు మండి పడుతున్నారు.

కొసమెరుపేమిటంటే....

ఈ మెమో పై వ్యతిరేకత వస్తున్న కారణంగా గుట్టుచప్పుడు కాకుండా వెనక్కి తీసుకొని అధికారులను బ్రతిమాలి మేనేజ్ చేసుకొని మీడియా కు ఎక్కకుండా సద్దుమణిగేలా చూస్తున్నారని సమాచారం.

Relative Post

Newsletter