ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు..
ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు..
స్పాట్ వాయిస్,హన్మకొండ: ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న భూముల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కుడా నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తో కుడా చైర్మన్ సుందర రాజ్ యాదవ్. వైస్ చైర్మన్ ప్రావీణ్య రైతులతో బుధవారం చర్చించారు. ఈ మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పై బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు.