శ్రీలంకతో టి ట్వంటీ సీరిస్‌

శ్రీలంకతో టి ట్వంటీ సీరిస్‌

విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌లకు విశ్రాంతి

వేకువవార్త : టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. లక్నో, ధర్మశాల వేదికలుగా ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌ నిమిత్తం స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. విధ్వంసకర ఆటగాడు, రాజస్థాన్‌ రాయల్స్‌ సారధి సంజూ సామ్సన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలకు తిరిగి జట్టులో చోటు కల్పించింది. జడేజాతో పాటు విండీస్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న జస్పీత్ర్‌ బుమ్రా కూడా లంకతో సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడిన జట్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. లంకతో టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ అనంతరం టీమిండియా రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 4`8 వరకు మొహాలీ వేదికగా తొలి టెస్ట్‌, బెంగళూరు వేదికగా 12`16 వరకు రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.


Relative Post

Newsletter