ఐసిసి ర్యాకులో దూసుకొచ్చిన టీమిండియా
ఐసిసి ర్యాకులో దూసుకొచ్చిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాయింట్ల పట్టికలో ఫస్ట్
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 269 రేటింగ్‌తో ఇంగ్లండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. విండీస్‌తో సిరీస్ విజయం తర్వాత భారత్ కూడా 269 రేటింగ్‌తో నిలిచింది. అయితే పాయింట్ల ట్యాలీలో ఇంగ్లండ్ 10474 పాయింట్లతో ఉండగా.. భారత జట్టు 10484 పాయింట్లతో ఉంది. దీంతో భారత జట్టు అగ్రస్థానానికి చేరింది. ఈ జాబితాలో భారత్, ఇంగ్లండ్ తర్వాత 266 రేటింగ్ పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. 255 రేటింగ్ పాయింట్లతో న్యూజిల్యాండ్, 253 రేటింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత టీ20 ప్రపంచకప్ విజేత ఆస్టేల్రియా మాత్రం 249 రేటింగ్ పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 4`1తో గెలిచినా ఆస్టేల్రియా ర్యాంకు మెరుగవలేదు. భారత్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచుల్లో పోరాడినప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన విండీస్ జట్టు ఏడోస్థానంలో ఉంది. మరికొన్నిరోజుల్లో శ్రీలంకతో భారత జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వన్డేల మాదిరే భారత్ మూడు టీ20ల సిరీస్‌ను కూడా పరిపూర్ణంగా ముగించింది.
ఆదివారం ఆఖరిదైన మూడో టీ20లోనూ భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3`0తో దక్కించుకుంది. ఇక భారత మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 65) తుఫాన్ ఇన్నింగ్స్ కనబర్చగా.. వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిరది. సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. అవేశ్, రుతురాజ్, శ్రేయాస్, శార్దూల్‌లను ఆడిరచింది. ఛేదనలో విండీస్ ఆరంభం నుంచే ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ మరో ఎండ్‌లో వికెట్లను మాత్రం కాపాడుకోలేక పోవడంతో నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. దీపక్ చాహర్ ఇన్నింగ్స్ తొలి, మూడో ఓవర్‌లో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో పూరన్, పావెల్ జోడీ మరోసారి ఎదురుదాడికి దిగి వణుకు పుట్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. కెప్టెన్ రోహిత్ నాలుగో నెంబర్‌లో ఆడగా ఓపెనింగ్‌లో ఇషాన్‌కు జతగా రుతురాజ్‌ను ఆడిరచారు. అయితే గత మూడు సిరీస్‌లుగా బెంచీకే పరిమితమైన రుతురాజ్ గైక్వాడ్ (4) నిరాశపరిచాడు. మూడో ఓవర్‌లోనే అతడిని హోల్డర్ అవుట్ చేశాడు. అటు ఇషాన్ కిషన్ (34)తో పాటు శ్రేయాస్ అయ్యర్ (25) కూడా ధాటిగా ఆడడంతో స్కోరులో వేగం పెరిగింది. నాలుగో ఓవర్‌లో ఇషాన్ మూడు ఫోర్లు బాదగా.. తర్వాతి ఓవర్‌లో శ్రేయాస్ రెండు ఫోర్లతో ఫామ్ చాటుకున్నాడు. అయితే చక్కగా కుదురుకున్న దశలో ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. అలాగే రోహిత్ (7)ను డ్రేక్స్ బౌల్డ్ చేయడంతో భారత్ ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో మరోసారి సూర్యకుమార్`వెంకటేశ్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కేవలం 37 బంతుల్లో ఐదో వికెట్‌కు 91 పరుగులు అందించారు. ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా యధేచ్ఛగా బ్యాట్లు రaుళిపించారు. ముఖ్యంగా సూర్యకుమార్ ఏడు సిక్సర్లతో చెలరేగడంతో డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు లయ తప్పారు. ఈ ఇద్దరి పోటాపోటీ బౌండరీలతో 16, 17వ ఓవర్లలో 17 పరుగుల చొప్పున వచ్చాయి.