దేశానికి కొత్త రాజ్యాంగ రచన జరగాలి
దేశానికి కొత్త రాజ్యాంగ రచన జరగాలి
పదేపదే మార్చడం కాకుండా కొత్తది రాసుకోవాలి
దీనిపై దేశవ్యాప్తంగా సమగ్ర చర్చ చేయాలి
కేంద్ర,రాష్ట్ర సంబంధాలపై స్పష్టమైన విధానాలు లేవు
దేశ ఆర్థిక విధానాలు దివాళా తీయించిన మోడీ ప్రభుత్వం
త్వరలోనే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం యత్నిస్తా
మోడీ ప్రభుత్వంతో దేశానికి ఒరిగిందేవిూ లేదు
వచ్చే ఎన్నికల్లో మళ్లీ 105 స్థానాలతో గెలుస్తాం
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు
త్వరలోనే 40వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విూడియా సమావేశంలో సిఎం కేసిఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం హోదాలోనే దేశం కోసం పోరాడతాడనని స్పష్టం చేశారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని..ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని భవిష్యత్ రాజకీయాలపై కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదని అన్నారు. అస్పష్ట రాజ్యాంగాన్ని పదేపదే సవరించడం కాదని, మార్చాలని కోరారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరల్ వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ రాష్టాల్ర హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని సీఎం విమర్శించారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్టాల్ర ఎన్నికలను సెవిూ ఫైనల్ అంటున్నారని.. అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. ప్రగగతిభవన్‌లో విూడియాతో మాట్లాడిన సందర్భంగా దేశ రాజకీయాలు,బిజెపి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకుశ్రీకారం చుడతానని ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గుజరాత్ సీఎంగా ఉండి మోదీ ప్రధాని అయ్యారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈనెల 5న ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తే స్వాగతం పలుకుతానని ప్రోటోకాల్ పాటిస్తానని కేసీఆర్ తెలిపారు. అయితే తన మనసులోని అన్ని విషయాలను ప్రధానికి చెప్తానని పేర్కొన్నారు. అటు త్వరలో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సదస్సు జరగనుందని.. ఈ సమావేశంలో దేశంలోని పరిస్థితులపై చర్చిస్తామని తెలిపారు. మేధో మథనం తరువాత పోరాట కార్యక్రమంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మోదీ టోపీలు, పంచెలు మార్చితే అభివృద్ధి అంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్టాల్ల్రో ఎంఐఎం గెలిస్తే మంచిదేనని, అసద్ తెలంగాణ వ్యక్తే కదా అన్నారు. ప్రధానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అన్నారు. దేశ ఆర్థిక పరిమితి పెంచే అవగాహన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమకు ప్రతిపక్షమే లేదన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులపై కేంద్రం పెత్తనమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని కేసీఆర్ ఆరోపించారు. తాను ముంబై వెళ్తున్నానని బీజేపీయేతర నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై పోరాటం జరుపుతానన్నారు. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుంటూ దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ తీరు దున్నపోతు మీద వాన పడ్డ చందంలా ఉందని, బీజేపీ దేశానికి పట్టిన దరిద్రమని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ యూపీలో గెలవొచ్చని, అయితే తద్వారా బీజేపీలో అహంకారం పెరుగుతుందన్నారు. అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తామన్నారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5 శాతం నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని సీఎం వివరించారు. పరిపాలన గురించి తెలియని వారే 317 జీవోను విమర్శిస్తున్నారని అన్నారు. ఈ జీవోతో స్థానికులకు ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి తమ వద్ద బ్రహ్మాండమైన మంత్రం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పోరాడి తెలంగాణను సాధించాం.. ఇప్పుడు దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రిటైర్డ్ అఖిల భారత అధికారుల సదస్సు హైదరాబాద్‌లో జరుపబోతున్నామన్నారు. దేశం ఏ పంథాలో ముందు కెళ్లాలో చర్చ జరుపుతామన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై యువత పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయపై తాను చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రబల పరివర్తన కోసం ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై రియాక్ట్ అవ్వాలని, విప్లవం సాధించాల్సింది యువతే అని అన్నారు. 75 ఏళ్ల తరువాత కూడా మన దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని, కేంద్రం జీడీపీ లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని అన్నారు.