ముగింపు కానరాని రష్యా – యుక్రెయిన్ యుద్దం

                                                                                            ముగింపు కానరాని రష్యా – యుక్రెయిన్ యుద్దం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సంవత్సరం కావస్తోంది . ఫిబ్రవరి 24 తేదీకి పూర్తిగా సంవత్సరం అవుతుంది . అయినా యుద్ధం ఒడిదుడుకులతో కొనసాగుతూనే ఉన్నది . ముగిసే ఆశ ఏమి కనిపించడం లేదు . అమెరికా నాతో దేశాలు యుక్రెయిన కు అన్ని రకాల సహాయం చేస్తున్నాయి . ఆయుధాలు , మందుగుండు , టెక్నాలజి , కమ్యూనికేషన్ , సమాచారం , ఆహారం ఇలా ఎన్నో రకాల సహాయాలు అందిస్తున్నాయి . నాటో దేశాల సైనిక సహాయ సమాచార సహాయం కారణంగానే రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో యుక్రెయిన్ఇన్ని రోజులు ని లబడ గలిగింది . ప్రారంభంలో రష్యా ఆక్రమించుకున్న కొంత ప్రాంతాన్ని యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది . ఉక్రెయిన్ సైన్యం ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత యుద్ధంలో ప్రతిష్టంభన పరిస్థితి కనిపిస్తోంది . రష్యా తిరిగి సంఘటిత పడుతూ  కొత్తగా మళ్లీ దాడులు పెంచుతూ వస్తున్నది . రష్యా కొత్తగా దాడి చేసిన ప్రతిసారి జెలన్ స్కీ , నాటోను అవసరమైన ఆయుధాలు కావాలంటూ అభ్యర్థించడం నాటో దేశాలు హామీ ఇవ్వడం తరువాత ఎన్నో ఆయుధాలు ఇవ్వడం మామూలే అయింది . యుక్రెయిన్ నగరాల మీద రష్యా దాడులు చేయగానే జలన్ స్కీ ,మాకు ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు కావాలని డిమాండ్ చేయడం నాటో దేశాలు ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు ఇవ్వడం జరిగింది . రష్యన్ మిస్సైల్స్ ను ద్రో న్ లను కొన్నింటిని ఆపగలిగి నా అ న్నింటిని మాత్రం యుక్రెయిన్ ఇప్పటికీ ఆపలేక పోతున్నది . ఇంకా ఈ మధ్యలోనే సోలెడర్ పట్టణాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకు ని , ఇంకా ముఖ్యమైన పట్టణం బఖ్ ముత్ ను ఆక్రమించుకొడానికి రష్యన్ సేనలు కదులుతున్నాయి . మరో వైపు యుక్రెయిన్ దక్షిణ భాగంలో జపోరియా ప్రాంతంపు పట్టణాలను కూడా కబ్జా చేయడానికి రష్యన్ సేనలు ప్రయిత్నిస్తున్నాయి .  దీని తరువాత మళ్లీ మరోసారి జెలన్ స్కీ , యుద్ధ ట్యాంకులు కావాలంటూ నాతోను అభ్యర్ధించాడు. ఒత్తిడి చేస్తున్నాడు . ఇప్పటి వరకు నాతో ఇచ్చిన ఆయుధాలు అనుకున్నంత ఫలితాన్ని  ఇవ్వలేక పోతున్నాయి . నేపథ్యంలో ఏ దేశం ట్యాంకులను  యుక్రే  ఇవ్వాలనేది ఇప్పుడు నాతో ముందు సమస్యగా మారింది . మొన్నటిదాకా అమెరికాకు చెందిన హిమర్స్ మిస్సైల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వాటి వలన యుక్రెయిన్ సైన్యం కొంత పురోగమించింది అని ప్రచారం చేశారు . ప్రారంభంలో టర్కీ ద్రో న్ లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారు . ఒక మనిషి మోసుకు వెల్లగలిగే ఆంటి టాంకు మిస్సైల్ సిస్టం ను , ఆంటి ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ ను కూడా అమెరికా ఇచ్చింది . ఇక ఇప్పుడు జర్మన్ లెపర్డ్ -    2  ట్యాంకుల గురించి ప్రచారం జరుగుతోంది . ఇవి సమర్థవంతమైన ట్యాంక్ని చెప్పబడుతున్నాయి . అందుకే జెలన్ స్కీ ఈ టాంకులు కావాలని కోరుతున్నాడు . ఈ ట్యాంకులు ఇవ్వాలా వద్దా ఎలా ఇవ్వాలి అనే అంశంపై జర్మనీలో  ని అమెరికా స్టెయిన్‌లో నాటో దేశాలు జనవర 20సమావేశం అయ్యాయి .

జనవరి 20 న జర్మనీలో అమెరికన్ రామ్ స్టెయిన్ ఎయిర్ బేస్ లో నాటో దాని మిత్ర దేశా లైన 50 దేశాల రక్షణకు సంబంధించిన నాయకులు సమావేశం అయ్యారు . సమావేశంలో యూరోపియన్ నాయకులు యుక్రెయిన్ కు జర్మనీకి చెందిన లెపర్డ్-2 టాంకులు జర్మనీ పై ఒత్తిడి చేశారు . ఈ లెపర్డ్-2 టాంకులు నాతో దేశాలన్నింటి వద్ద ఉంటాయి . కానీ అవి జర్మనీ టాంకులు అయినందున జర్మని అనుమతి లేకుండా ఇతర దేశాలకు ఇవ్వకూడదు . జర్మనీ అంగీకరించిన ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు , నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు . కానీ ఈ సమావేశంలో జర్మనీ రక్షణమంత్రి పిస్టోరియస్ చెప్పిన విషయం జర్మనీ అంగీకరించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ,అయినా త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు . నిజానికి ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి నాటో దేశాలు అన్నీ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నప్పటికి , అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు . రష్యాపై విధించిన ఆంక్షలు యూరోపియన్ దేశాలకు భారంగా మా రాయి . అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్న యూరోపియన్ దేశాలు , రష్యా పై ఆంక్షలతో వాటి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు పెరుగుతున్నాయి . అయినా తాత్కాలికంగా తిరిగి ఈ దేశాలన్నింటిని రష్యాకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిపి ఉంచగ లుగుతున్నది అమెరికా . తన  లెపర్డ్-2 యుద్ధ ట్యాంకులను ఇవ్వడానికి ఒప్పుకొని జర్మనీ

 

ఈ రోజు అంటే జనవరి 23 న కొంత రాజీ పడినట్లు కనిపిస్తున్నది . జర్మనీ విదేశాంగమంత్రి TV కి ఇంటర్ ఇస్తూ ఒకవేళ ఫ్రెంచ్ జర్మనీ అనుమతి లేకుండానే లెపర్డ్-2  ట్యాంకులను యుక్రెయిన్ కు సరఫరా చేస్తే జర్మనీ అడ్డుకో బోదు అని చెప్పింది . అంటే దానితో మాకు సంబంధం లేదని చెప్పడమే ఇది . అంటే ఒక విధమైన రాజి నే అయినా జర్మనికీ అంగీకారం లేదని చెప్పడమే . అమెరికాకు , యూరోప్ కు చెందిన  నాటో దేశాలను ఇంకా చాలా కాలం నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు . ఏ దేశం తన దేశ ప్రయోజనాలను పూర్తిగా పట్టించుకోకుండా ఉండజాలదు . 

Relative Post

Newsletter