నూరుతున్న విద్వేషపు కత్తులు
నూరుతున్న విద్వేషపు కత్తులు
వీరి చరిత్రంతా విద్వేషమే..
తెలంగాణ లక్ష్యం గా బీజేపీ.ఆర్ఎస్ఎస్ పావులు
టిఆర్ఎస్ కు కౌంటర్గా హైదరాబాద్ ఫైళ్లు
అభివృద్ధిఓట్
అంతా మతోన్మాదామె
వూహించిందే జరుగుతోంది...భయపడ్డట్టే జరగబోతున్నది.....
మార్చిలో రాష్ట రాజకీయా పరిణామాలపై వేకువ కథనం....
ఆ మహాభారత రణభూమి గా తెలంగాణ రాష్ట్రం ను ఎంచుకున్నారా .. అన్న అనుమానాలు బలపడుతున్నాయి.రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే దక్షినాది లో ఎంటర్ కావాలంటే ఇక్కడ జరిగిన హిందు వ్యతిరేక ఉద్యమాలు,ద్రావిడ ఉద్యమాలతో పాటు ప్రపంచాన్నే ఆకర్షించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,వర్గపోరాటలిచ్చిన చైతన్యం ఎపుడూ ఇక్కడ చాందసత్వం కు చోటునివ్వని పరిస్థితి.దీన్ని ఏ విదంగానైనా ఓడించి అఖండభారత్ గా మార్చేందుకు పాసిస్ట్ ప్రభుత్వాలను ఏర్పరిచేందుకు మోడీ-షా ల ముందుపెట్టి ఆర్.ఎస్.ఎస్. వ్యూహ రచన చేస్తోంది.దానిలో భాగమే తెలంగాణ లో బిసి సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ వంటి కరడుగట్టిన ఆర్.ఎస్.ఎస్ వాదిని అధ్యక్షుడు గా చేయడం.తెలంగాణ రాష్ట్రం లో యువతను నిర్లక్ష్యం చేయడం,దళిత ,ఆదివాసీల సమాజలను మోసం చేయడం, ఉద్యోగ,ఉపాధ్యాయ,మిడిల్ క్లాస్ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం,ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేయడం,వామపక్ష సమూహాల పోరాటాల పై ఉక్కుపాదం,ప్రజా స్వామిక వాతావరణం రోజురోజుకు దూరం అవ్వడము తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యూరోక్రాట్స్ సలహాల మేరకే విధానాల రూపకల్పన,పోలీస్ పై ఎక్కువ ఆధారపడటము సహజంగానే ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతున్న పరిస్థితి.
ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, కాంగ్రెస్ దేశవ్యాప్తంగానే అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడడం, వామపక్షాలు నామమాత్రంగా ఉండటము. తీవ్ర అణచివేతతో విప్లవపార్టీలు ఇక్కడినుండి షిఫ్ట్ కావడం. వెరసి ఇక్కడ తెలంగాణ లో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడిన స్థితి.దీన్ని ఉపయోగించుకొని తెలంగాణ ను చేజిక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.అనుకోని వరం ల దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు.ఆ వెనువెంటనే జి.హెహ్.ఎమ్. సి. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ను చాందసవాదం తో సవాల్ చేసి మైనార్టీ ముస్లీలములను బూచిగా చూపి అనుకున్న టార్గెట్ చేరుకోవాడానికి ఉత్సహాంతో
హైదరాబాద్ గల్లీల్లో ,బస్తీల్లో "భారత్ మాతకు జై".
"జై శ్రీరాం", "రామ,లక్ష్మన,జానకీ"
వీరికి ఎన్నికల ఇంధనాలగా మార్చుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మత యుద్ధోన్మాదాన్ని పొంగిపోర్లించారు.
విధ్వంసానికి దారితీసే మతమౌఢ్యత
దూరద్రుష్టితో హైదరాబాద్ లో ముస్లిం ఛాందస వాద పార్టీ ఎం.ఐ. ఎమ్. భారతీయ జనతాపార్టీ మనిషిని మత విష ప్రభావితం చేసేందుకు "పాతబస్తీలో సెర్జీకల్ స్ట్రైక్ చేస్తాం" "దారుసలేం ను రెండు గంటల్లో కూలుస్తాం"
"ముస్లిం కొడుకులను పాకిస్తాన్ కు తరుమూతము". రోహింగ్య లు ,బంగ్లాదేశీయులు ఉన్నారు వారిని తరిమికొడుతాం"
"కేవలం 12 శాతం ఓట్లకోసం భాగ్యనగరం లో మైనార్టీల అనుకూలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని,
"యెస్ బరాబర్ బీజేపీ మతత్వపార్టీనే" 80 శాతం ఉన్న హిందువుల పార్టీ బీజేపీ నే, వారి ధర్మం కోసమే పని చేస్తాది.
ప్రతి దానిలో దైవాన్ని చూసి కొలిచే పూజించే పార్టీ బిజెపి అని..
భూమిని భూ మాత అంటము..
నీటిని గోదావరి తల్లి అంటము..
అగ్ని ని అగ్ని దేవుడటంము..
గాలిని వాయు దేవుడు అంటము...
కుక్క కరిస్తే మల్లన్న దేవుడికి మొక్కుతాం.
కోతి కరిస్తే అంజ నేయ స్వామి అంటాం..
పాము కరిస్తే నాగదేవతకు మొక్కుతాం...
ప్రతి దానిలో దైవాన్ని మొక్కుతామంటూ అధర్మమే హిందూ ధర్మం అని బండి. సంజయ్ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు.
ఎక్కడ హిందూ ఓట్లు పొలరైజ్ అయి బిజెపి బలపడుతాదేమో నన్న భయం కేసీఆర్ కు పట్టుకొని
"భయంకరమైన హిందువు నేనే"
అసలు హైందవం నాదే నాని.. నాకు భక్తి వుంది.
అని బీజేపీ కి కన్నా నేనే అపనహిందువును అన్నాడు. వాస్తవానికి ఎక్కడైనా చాందసత్వం ,వాదులు ఎక్కడైతే, ఎప్పుడైతే రాజ్యాధికారం కైవశం చేసుకుంటారో అక్కడ వారు మత ఫాసిస్టు ప్రభుత్వం నెలకొల్పుతారు.
మత నీరంకుశ త్వ పాలన ను సాగిస్తారు. మత చాందసవాద ప్రభుత్వం ప్రజాస్వామ్యానికీ, సెక్యులర్ సమాజానికీ, సమానత కోరుకునే సామ్యవాదానికి బద్ధ శత్రువుగా ఉంటుంది,వ్యవరిస్తుంది!.
దైవం, స్వర్గ సౌఖ్యాలను ఆశపెట్టి ప్రజల్లో మత మౌఢ్యం ను మళ్ళీ మళ్ళీ పటిష్ఠం చేయకుండా,వారిలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టకుండా -టెర్రరిజం, ఫాసిజం సూత్రాల మీద ఆధారపడిన మత రాజ్యాన్ని స్థాపించడము సాధ్యం కాదు కాబట్టి.
మూఢ విశ్వాసాలు ఎంత ప్రభలంగా,లోతుగా, ఎంత ప్రభావంతో రక్తంలో ,నరనరాన ఎక్కించడం ఉంటుందో,అంత ప్రభలంగా వారు తమ ప్రాణాలను తీయడానికి ,ఇవ్వడానికి సిద్ధపడతారు అలా చేసేందుకే ఇవాళ భారత దేశం లో చాందసవాదమా,ప్రజాస్వామ్యామా..... అన్నట్టు రాజకీయాలు సవాల్ చేస్తున్నవి.
వీటికి విరుగుడుగా నేనే నిఖార్సయిన హిందువు, భయంకరమైన యాగాలు, ఇదీ హైందవం అని పోటీ పడితే దేశం ఫాసిజం లోకి వెళ్లడం ఖాయం
.వీరి చరిత్రంతా విద్వేషమే..*
'ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం' అని కిర్తించ బడుతున్న ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను మత ఛాందస వాదం సవాలు చేస్తుంది. 20 వ శతాబ్దపు తొలి నాళ్ళలో పశ్చిమ భారతదేశంలో వెల్లివిరిసిన దళిత చైతన్యానికి, తిరుగుబాట్లకీ ప్రతిస్పందన లో భాగంగానే - హిందూ చాందసవాద శక్తులు పుట్టుకొచ్చాయనే సంగతిని -ఇప్పటికే అనేకమంది మేధావులు సమగ్రంగా విశ్లేషించారు.
1925లో స్థాపించబడ్డ ఆర్.ఎస్.ఎస్. ఏనాడు స్వతంత్ర పోరాటం లో పాల్గొని ఎరగదు.ఇప్పుడు సంఘ్ పరివార్ రూపంలో దేశవ్యాప్తంగా ఊడలు దిగిన వట వృక్షం మాదిరిగా విస్తరిస్తోంది. అలనాడు జాతిపిత గాంధీ జీ హత్య నుంచి,బాబ్రీ మసీదు విధ్వంసం వరకూ వీరి ప్రేరణ తో జరిగినవే. అయితే నేటికీ వెతికి ..పబ్లిగ్గా బాధ్యత తీసుకునే అలవాటు సాంగ్ కు లేదూ. దశాబ్దాలుగా మన దేశంలో జరిగినా అనేక మతకల్లోలాల్లో సంఘ్ ప్రేరిపిత శక్తుల ప్రమేయం ఉన్నదనేది బహిరంగ రహస్యం.
ఉత్తర భారతం లో అయితే సంఘ్ పరివార్ ప్రమేయం ఉన్న శక్తులు బహిరంగంగా శూలాలు,కత్తులు పంచుతూ... ప్రయివేటు సైన్యాన్ని తయారు చేస్తూ
దేశభక్తి పీఠానికి తామే అధిపతులమని భావిస్తారు. జాతీయత వంటి విషయాల్లో ఒరిజినల్ పెటెంట్ హక్కుదారుల్లా ప్రవర్తిస్తారు.
కేవలం మతం వేరన్న కారణంగానే ఒక సెక్షన్ ప్రజల్ని తమ దేశభక్తిని నిరూపించుకోవాలని మళ్లీ మళ్లీ షరతులు,సవాళ్లు విసురుతారు. విశ్వాసం పేరిట విధ్వంసం జరిపించి అదే జాతీయతగా దబాయిస్తారు.
కాషాయ పతకాం చేతిలో ఉన్న భరతమాత బొమ్మ చూపించి అఖండ భారత్ కోసం గాలిలో కత్తులు తిప్పుతూ వీరంగం వేస్తారు.
శాంతి,ప్రేమ, సహనం వేల సంవత్సరాలుగా విశ్వానికి చాటిన మన మహత్తర మాతృ భూమి హిందూస్థాన్ సందేశాన్ని వీరు ' అసహనం', 'విద్వేషం' గా వక్రీకరిస్తారు.
"భిన్నత్వంలో ఏకత్వం " కాకుండా "ఏకత్వం లో చాందసత్వం"ఉండాలని వీరు చేసిన విషప్రచారానికి ఇప్పటికే అనేకసార్లు ఈ దేశం తన రక్తంతో మూల్యం చెక్కించుకుంది.
చాందసత్వమే తక్షణ కర్తవ్యమని -వీళ్ళు చేసిన వాదాన్ని దేశ ప్రజలు పదే పదే తిరస్కరించారు. కానీకార్పోరేట్ మీడియా, మల్టీనేషనల్ కంపిణీలు,అంబాని దన్నుతో వీళ్ళ చాందసత్వం వెనుక దేశభక్తి ఉందని ప్రజానీకాన్నీ భ్రమింపజేసి అధికారంలోకి వచ్చారు. వీరికి ప్రతినిధులు గా మోడీ,షా ల ద్వయం ఒకరు ప్రధానిగా,మరొకరు హోంమంత్రి గా నాయకత్వం వహిస్తున్నారు.వీరు నాడు అంతర్జాతీయ మీడియా సమక్షంలో బహిరంగంగా బాబ్రీ ని కూల్చే దుండగానికి పాల్పడి,దేశ ప్రతిష్టకు ఎనలేని మచ్చ తేవడమే కాకా, ఆ ఘోరాన్ని స్వాతంత్ర్య ఉద్యమము గా చెప్పుకునేందుకు తెగబడ్డ వీరు మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు వరకు వచ్చేవరకు తేలుకుట్టిన దొంగలవలె కిమ్మనకుండా తమ చేతిలో ఉన్న న్యాయవ్యవస్థ ద్వారా అబద్ధాలు చెప్పించిన నైజం వీరిది.గోద్రా దూరంతం లోనూ ,సంఘపరివార్ సంస్థలు దగ్గర ఉండి జరిపించిన గుజరాత్ మారణకాండలోను రెండు, మూడు వేల మంది ప్రజలను బలి తీసుకున్న ప్రత్యక్ష భాద్యులు నేడు ఈ దేశాన్ని ఎళుతున్నారు.
వీరు గోద్రా వీధుల్లో హంతక తండాలకి నాయకత్వం వహించి,దగ్గర ఉండి హత్యలు,గృహదానాలు,సామూహిక మన భంగాలు...,సజీవ దహనాలు,గ్యాస్ బండల్ని ఇళ్ళల్లో విసిరి పేల్పించి, కాలనీ లకు,కాలనీలు, వీధులకు వీధులు... ముస్లిం ప్రజలను కీటకాలను చంపినట్లుగా..చంపించిన... వందల సంఖ్యలో మసిధుల్ని ధ్వంసం చేయించి లక్షన్నార మంది ప్రజలు సర్వం కోల్పోయి శరణార్ధ శిబిరాల్లో కాలం వెళ్లదీసే పరిస్థితి కల్పించి,పది వేల కోట్ల ఆస్థి బూడిద కావడానికి కారణమైన వారు భారత సమాజం మొత్తం ను హిందూ చాందసత్వం లోకి తీసుకెళ్లేందుకు రాజ్యాధికారం కైవసం చేసుకున్నారు. ఇక ఈ 7 ఏళ్లలో ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ,అయోధ్య ఏకపక్ష తీర్పు, ఆర్టికల్ 370 రద్దు,కాస్మిర్ ను ముక్కలు చేసి బలప్రయోగం ద్వారా చీకటి నిరంకుశత్వ పాలన సాగించడం. దేశంలో పార్లమెంటరీ ధర్మాన్ని తుంగలో తొక్కి ఒక్క ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ్వంసకర విధానాలు..కొనుగోలు రాజకీయాలతో రాష్టాలను చేజిక్కించుకొంటువస్తున్నది.
ఇప్పటివరకు సెక్యులర్ లేక "ప్రజాస్వామిక " రాజ్యం గా కొనసాగుతున్న ఇండియాను అఖండ భారత్ గా మారుద్దామని... ఒకే దేశం..ఒకే ఎన్నికలు.. ఒకే నినాదం పేరుతో విద్యార్థులను,యువకులను చేరదీసి,వారిలో మతపిచ్చిని నూరిపోస్తూ ఉన్మాదం పెంచిపోశిస్తుంది.మైనారిటీలకి హిందువులతో సమాన ప్రతిప్తతిని ఇవ్వొద్దని, ముస్లింలు పరయివారే.వారినీ వారి మత విశ్వాసాలనీ భారతీయికరించాలి. హిందువులకీ, హైందవేతరుకీ మధ్య మహాభారత యుద్ధం జరుగవచ్చని వీరి విశ్వాసం.
నాడు స్వదేశీ జాగరణ మంచ్ అంటూ ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలను,సంస్కరణలను తాము వ్యతిరేకం అని కమ్యూనిస్టు ట్రెడ్ ,రైతు సంఘాలతో కలిసి ఐక్య సంఘటన ల పేరు తో తాము రెండవ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభిస్తామని దేశ ప్రజలకు దేశభక్తి పేరు చెప్పి నేడు దేశంలోని వనరులను,ప్రభుత్వ రంగ సంస్థలను,ప్రజల సంపదను,ప్రజల శ్రమను ప్రపంచ కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఇవాళ ప్రతి రంగం రైల్వే, భీమా,ఒకటేమిటి ప్రతి ప్రభుత్వ రంగం ను అమ్మడమే,దోచుకోవడమే పని పరిపాలన అన్నట్టు కొనసాగుతున్నది.
ఆదివాసీల కాళ్ళకింద ఉన్న అపారమైన ఖనిజ సంపద ను ఎమ్.ఎన్.సి. ల పరం చేసేందుకు ఆదివాసీ ప్రాంతంలో ఆ ప్రజల పై యుద్దానికి దిగుతూ రక్తపాతం పారిస్తున్నది. ఈ దేశంలో ఆదివాసుల, మైనారిటీల,పీడిత ప్రజల హక్కుల రక్షణ కు పూనుకుంటున్న ప్రజా స్వామిక వాదుల పై,రచయితలపై,కవులు, కళాకారుల, పాత్రికేయులపై ఉపా వంటి అమానవీయ చట్టాలను ప్రయోగించి దాడులు ,నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దమనకాండ పరాకాష్ట చేరుకున్నది. తమను కాదన్నవారిని,విభేదించిన వారిని దేశ ద్రోహులు ముద్రలు వేయడం అది ఎంత వరకు పోయిందంటే.ఈ దేశాన్ని అత్యధికంగా పాలించిన సెంట్రీస్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, వామపక్షాల పార్టీల నేతలు సీతారాం ఏచూరి, దిగ్విజయ్ సింగ్,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కన్నాయకుమార్, ఆజాద్ చంద్రశేఖర్ ఆఖరుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేశ ద్రోహుల జాబితా లో చేరిపోయిండు.
కేసీఆర్ వంటి వారిని కూడా మిగల్చరు.అందుకే 90 లలో కూడా ఇలానే అద్వానీ రథయాత్ర లో దేశంలో హిందూత్వ మత దండ యాత్ర తో దేశంలో పాటు తెలంగాణ లో కూడా కొంత యువత,లంపేన్ యువత,భూస్వామ్య శక్తులు బలపడే ప్రయత్నం మత రాజకీయాలతో బలపడాలని చూస్తే వీటికి ఈ రాజకీయాలకు విరుగుడుగా వామపక్ష భావజాలం పెరుగుదలనే అడ్డుకట్ట వేస్తదని రాజనీతి తో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి సమావేశాలు,ప్రజాస్వామికరణ వాతావరణం ఏర్పరిచారు. కొద్దికాలం అయినా..ఆ సమయంలో విద్యాలయాల్లో..సమాజంలో లో భావ సంఘర్షణ జరిగేలా ,శాస్త్రీయ దృక్పథం పెరిగేలా ఆనాడు ఉన్న రాడికల్ శక్తులు, ప్రగతిశీల వాదులు కృషి చేసారు.చెన్నారెడ్డి నుండి ఈ విషయం లో కేసీఆర్ నేర్చుకోవాల్సి వుంటుంది.కనుక తెలంగాణ లో ఇప్పటి వరకు మత తత్వ రాజకీయాలకు చోటు లేకుండా పోయింది.కాబట్టి జీవితం పట్ల శాస్త్రీయ దృక్పథం అవలంభించే సెక్యులర్, ప్రజాస్వామిక మార్గాన్ని అనుసరించేలా..ప్రజా బహుళ్యం లో చర్చ జరిగే ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడినపుడే ఆధునిక జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ ,సుఖసంతోషాలతో జీవించగల్గుతారు.ఆ సమాజం వైపు తెలంగాణ సమాజం ముందుండి దేశానికి మార్గదర్శనం చేయాలని కోరుకుందాం.
-బండి.దుర్గాప్రసాద్
6303375514