నిరుద్యోగ హర్యానా - బిజెపి విచిత్ర చికిత్స

                                                                  నిరుద్యోగ హర్యానా - బిజెపి విచిత్ర చికిత్స

    బిజెపి అధికారంలోకి రావడం కొరకు చేయని హామీలు అంటూ ఏమి లేవు . అందులో ఒకటి నిరుద్యోగం . మేము అధికారంలోకి వస్తే లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల సభలలో హామీలు గుప్పించారు . కేంద్రంలోను , హర్యానాలోనూ బిజెపి రెండవసారి ప్రభుత్వాలను నడుపుతున్నది . అధికారంలోకి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నది . ఎవరైనా బిజెపిని నిరుద్యోగ ఎన్నికల హామీ గురించి ప్రశ్నిస్తే , బజ్జీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అని బదులిచ్చారు . కాని నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు . బిజెపి పాలిత ప్రాంతం అయిన హర్యానాలో నిరుద్యోగం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని , సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ  (CMIE) రిపోర్ట్ చెప్పుతున్నది . CMIE 2022 డిశంబర్ రిపోర్ట్ ప్రకారం మొత్తం భారత దేశంలో 8.3 శాతం ఉంటే హర్యానలో 37.4 శాతంగా ఉన్నది . హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం హర్యానాలో 6 శాతమే నిరుద్యోగం ఉన్నదని బుకాయిస్తున్నాడు . అయితే ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగాన్ని నియంత్రించడానికి ఉద్యోగ కల్పనకు పూనుకుంటారు . కాని హర్యానా ప్రభుత్వం విచిత్రంగా ఇంకా నిరుద్యోగాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నది .

           2023 ఫిబ్రవరి 6 న హర్యానా ప్రభుత్వ ఆర్ధిక శాఖ , అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారి చేసింది . దీని ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగలైనా రెండు సంవత్సరాల  నుండి ఖాలిగా ఉంటే ఆ ఉద్యోగాలు అన్ని రద్దు లేదా సమాప్తం అయినట్లుగానే లెక్కించ బడుతుంది . ప్రభుత్వం తీసుకున్న  ఈ నిర్ణయం తరువాత ప్రతిపక్ష పార్టీలు , ఉద్యోగ సంగాలు , హర్యానా బిజెపి ప్రభుత్వం పైన మండి పడుతున్నారు . హర్యానాలో మొత్తం అంగీకరించబడిన ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల 58 వేలు ఉంటే అందులో 1 లక్ష 82 వేలకు పైగా ఉద్యోగాలు ఖాలిగా ఉన్నాయి . అంటే ఇప్పటికే మిగిలిన ఉద్యోగుల పైన ఎంత పని భారం ఉన్నదో అర్ధం అవుతున్నది . పని భారం తగ్గించడానికి ఖాలీలను భర్తీ చేయకుండా ఆ ఉద్యోగాలనే రద్దు చేయడమేమిటని ఉద్యోగ సంగాల నాయకులు విమర్షిస్తున్నారు . ఇప్పటికే 13462 ఉద్యొగాలను హర్యానా ప్రభుత్వం రద్దు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రందీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేసాడు . గతంలో ఇటువంటి ఖాలీగా ఉన్న ఉద్యోగాలను ఆర్ధిక శాఖ అనుమతితో నింపేవారు . కాని హర్యానా బిజెపి ప్రభుత్వం ఆ ఉద్యోగాలనే సమాప్తం చేస్తున్నది . ఇది బిజెపి మార్కు నిరుద్యోగ నిర్మూలన అన్నమాట .          

Relative Post

Newsletter