దేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజం విశ్వనాథ్
దేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజం విశ్వనాథ్
కళాతపస్వికి చిరు జన్మదిన శుభాకాంక్షలు
భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో కళాతపస్వీ కె.విశ్వనాథ్ ముందువరుసలో ఉంటాడు. రోటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఏఎన్‌ఆర్, కాంచన, రాజేశ్వరి నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచమయ్యాడు. ఈయన ఇప్పటివరకు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈయన చివరగా అల్లరినరేష్‌తో శుభప్రదం చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు.ఇక శనివారం ఈయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీప్రముఖులు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఈ క్రమంలో చిరంజీవి, కె విశ్వనాథ్ గారికి ట్విట్లర్‌లో శుభాకాంక్షలు తెలియజేశాడు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ’గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుజాతి, తెలుగుసినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరా భరణం తర్వాత అనేలా చేసిన విూరు తెలుగు వారందరికీ అందిన వరం. విూ చిత్రాలు అజరామరం. విూ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. విూరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశాడు. వీళ్లీద్దరి కాంబినేషన్ లో శుభలగ్నం, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు చిరంజీవి కెరీర్‌లోనే గుర్తిండిపోయే చిత్రాలుగా నిలిచాయి.