సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవద్దు

సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవద్దు

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

ప్రజలు అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ప్రజలకు పిలుపునిచ్చారు.సైబర్ నేరాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన చేస్తూ రోజు, రోజుకి పెరిగి పోతున్న టెక్నాలజీ వినియోగించుకోని  సైబర్ నేరగాళ్ళు  చేతులో మోసపోయి డబ్బులు పోగోట్టుకున్న బాధితులు అధికమవుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయి డబ్బు పోగొట్టుకున్న బాధితులు తక్షణమే సైబర్ క్రైం పోర్టల్  హెల్ప్ లైన్ నంబర్  155260కు డయల్ చేసి సమాచారాన్ని అందజేయాలని లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని..ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులు 24గంటల లోపు సైబర్ క్రైం హెల్ప్ లైన్ కు సమాచారం అందజేయడం ద్వారా బాధితుల తగు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయని. ఈ హెల్ప్ లైన్ నంబర్ ప్రాచుర్యం కల్పించే దిశగా వరంగల్ కమిషనరేట్ పోలీసుల తరుపున వివిధ సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేయడం ప్రారంభించడం జరగిందని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. అదే విధంగా ప్రజలకు తమ అండ్రాయిడ్ ఫోన్లకు గుర్తుతెలియని వ్యక్తులు సంస్థల నుండి  అనుమానస్పదంగా వచ్చే లింక్ లపై ప్రజలు క్లిక్ చేయవద్దని...ఈ విధంగా చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో పోతుందని. ముఖ్యంగా ప్రజలు తమ ఫోన్ల ద్వారా లేదా సామాజిక మాద్యమాల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులతో తమ వ్యక్తిగత సమాచారం ఫోటోలు, ఓటిపిలను షేర్ చేసుకోవద్దని  పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Newsletter