సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

రెండు ఎన్ కౌంటర్ లలో ఐదుగురు మావోలమృతి

అందులో ఇద్దరు మహిళా నక్సల్స్  గుర్తింపు 

కీలక నేత సుధాకర్ హతం

వేకువ న్యూస్, వరంగల్ క్రైమ్:  చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయంవేరువేరుగా జరిగిన  రెండుఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టు లు మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనలు గిరిజన గూడాలను కలవరపెడుతున్నవి.ఈ ఎన్ కౌంటర్లలో ఇద్దరు మహిళనక్స ల్ తో పాటు వెంకటాపురం, వాజేడు ఏరియా కు చెందినకు కీలకనేత డివిసి సుధాకర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ జవానును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పొరుగు రాష్ట్రంలోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండలం పేరూరు దగ్గరి ఇల్ మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సేమలోద్దీ పెనుగోలు గ్రామ శివారు కర్రీపేట గుట్ట అడవుల్లో మావోలకు జవాన్లకు వేరువేరుగా హోరాహోరీగా కాల్పులు జరిగాయి.  ఫోలీసుల కథనం   ప్రకారం వివరాలిలా వున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్న్   సమాచారం అందుకున్న పోలీస్ బలగాలైన గ్రేహౌండ్స్  , డి ఆర్ జి సి ఆర్ పి ఎఫ్ బలగాలుభారీ ఎత్తున అడవుల్లో గాలింపులు  ముమ్మరం చేశాయి. ఆ సందర్భంగా జరిగిన వేటలో అడవిలో గుట్టల సమీపం నుంచి మావోలుకాల్పులు జరుపగా ఆత్మరక్షనార్థం అప్రమత్తమై జవాన్లు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. 

ఇద్దరు నక్సల్స్ గుర్తింపు 

దంతేవాడ జిల్లా సుక్మా సరిహద్దు అడవుల్లో మార్గం శివారులో జరిగిన మొదటి ఎన్ కౌంటర్ లో చనిపోయింది మహిళా నక్సల్ అని పోలీసులు తెలిపారు.  కర్రే గుట్ట అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన కీలక నేత సుధాకర్  గుర్తించినట్టు బస్తర్ ఐజి సుందర్ రాజ తెలిపారు. మొదట సేమాలోది అడవిలో మృతి చెందిన మహిళ నక్సల్స్  మార్జూమ గా తెలిపారు.  ఇంకా మిగిలిన ముగ్గురు నక్సల్స్ ఎవరు ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నామని అధికారులు చెప్పారు. కాల్పులలో తీవ్రంగా గాయపడ్డ జవాన్ నుప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ ఎంజీఎం తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ లోని  ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు.  కాల్పులు జరుపుకుంటూ పారిపోయిన మావోల లో కొందరు గాయపడినట్లు కూడా తెలిసిందని అధికారులు అన్నారు.  అయితే కచ్చితమైన సమాచారం అందాల్సి ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా ఆగకుండా మావోలకోసం గాలింపు ముమ్మరం చేసి అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ రెండు ఎన్ కౌంటర్ లతో సరిహద్దు తెలంగాణలోని పోలీసులు కూడా అప్రమత్తమై గాలింపులు ముమ్మరం చేశారు. అయితే  జరిగిన ఎదురు కాల్పులు గురించిఇంకా పూర్తిసమాచారం అందాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Newsletter