దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తే దాడులా? ప్రశ్నించిన వారిపై కేసులా?

దుర్మార్గ విధానాలను 

వ్యతిరేకిస్తే దాడులా?

ప్రశ్నించిన వారిపై కేసులా?

తీవ్రంగా ఖండించిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక


వేకువ వార్త, హైదరాబాద్​​: ‘‘ఇంత దుర్మార్గమా? ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ లేదు.. ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, న్యాయవాదులు, జర్నలిస్టులకు తదితర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి..’’అని తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్  చేస్తున్న వారిపై అక్రమంగా కుట్ర కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అన్యాయమని  తెలంగాణప్రజస్వామిక వేదిక శనివారం ఒక ప్రకటనలో ఆక్షేపించింది.  ప్రశ్నించిన వారిపై  భౌతిక దాడులు చేయడం, హత్యలు చేయడం అధికార పార్టీ నాయకులకు, వారి మద్దతు దారులకు నిత్యకృత్యంగా మారిందన్నారు. ఇందులో భాగంగా  మొన్న న్యాయవాదుల హత్యలు, దాడులు, సోషల్ మీడియా జర్నలిస్టుల మూకుమ్మడి అక్రమ అరెస్టులు,  ఇటీవల మహబూబ్ నగర్​లో  జరుగుతున్న కుట్రలు, హన్మకొండలో  జర్నలిస్ట్​ ప్రదీప్ మీద జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో ఉద్యోగ, జర్నలిస్టు (టీజేఎఫ్​) సంఘాల రాష్ట్ర నాయకత్వాలు  పూర్తిగా అధికార పార్టీకి అనుబంధంగా మారి.. ఆయా సంఘాల సభ్యులు ప్రభుత్వ దుర్మార్గ విధానాలు ప్రశ్నిస్తుంటే వారిపై దుర్మార్గపు దాడులు చేస్తున్నారన్నారు. ఈ దుర్మార్గ విధానాలను విస్తృత ప్రజాస్వామిక ఉద్యమమే అడ్డుకోగలదన్నారు.   తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్స్  ప్రొఫెసర్​ హరగోపాల్,  జైని మల్లయ్య గుప్త, పీవోడబ్ల్యూ సంధ్య, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, చిక్కుడు ప్రభాకర్, ప్రసాద్,  ప్రొఫెసర్​ విశ్వేశ్వర్​రావు తదితరులు ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

Relative Post

Newsletter