ప్రజల స్వేచ్చ, హక్కులను సంరక్షించండి.. ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ లేఖ
బీఆరెస్ నిరంకుశ పాలనకు చరమగీతం
కాంగ్రెస్ గెలుపునకు బీఆరెస్‌పై వ్యతిరేకతే కారణం
గత ప్రభుత్వం ప్రశ్నించిన గొంతులను నొక్కేశారు
తెలంగాణలో పెరిగిన నిరుద్యోగం
బీజేపీతో బీఆరెస్ రహస్య బంధం
మీరైన ప్రజా సమస్యలు తీర్చండి
బీఆరెస్ నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ గెలుపునకు బీఆరెస్ వ్యతిరేకతనే కారణమని పేర్కొంది. బీఆరెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకనే గద్దె దింపారని తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవిధంగా అమలు చేస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఉచితాల ద్వారా మరింత ఆర్థిక భారం పడనుందని అన్నారు. తెలంగాణ నూతన ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ తొలిసారిగా ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ
తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆరెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్త కుప్పలో విసిరేశారని, దీనితో నూతనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని జగన్ పేర్కోన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, లేదా కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనో, ఆయా సెక్షన్ల ప్రజలకు ప్రకటించిన డిక్లేరేషన్లను నమ్మో వారికి ఓట్లు వేసి గెలిపించ లేదని, బీఆరెస్ వ్యతిరేక ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడ్డాయన్నారు.
ప్రశ్నించిన గొంతులను నొక్కేశారు
వాస్తవానికి పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియమకాలను ఆశించిన ప్రజలకు బీఆరెస్ ప్రభుత్వ పాలనలో అభించలేదన్నారు. అంతకంటే ముఖ్యమైంది ప్రజా స్వామ్యాన్ని ద్వంసం చేసి ప్రజలను నిస్సహాయ స్టిలోకి నెట్టారన్నారు. ఈ పదేళ్ళ కాలంలో కనీస చట్టబద్ద పాలన కాదు కదా కేంద్రీకృత, నిరంకుశ అణిచివేత పాలనను కొనసాగించారన్నారు. ప్రశ్నించిన గొంతులను నొక్కేశారని, క్రింది ఉద్యోగులపై దౌర్జన్య పూరిత విధానాలను అమలు చేస్తూ వారిపై పని భారాన్ని పెంచారన్నారు. సామ్రాజ్యవాదుల, బడా కార్పోరేట్ల, భూస్వాముల, దోపిడి పాలకుల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులను, నియమకాలను అక్రమంగా దారి మళ్ళించారని విమర్శించారు.
పెరిగిన నిరుద్యోగం
ప్రవేటీకరణకు ప్రాధాన్యతను కల్పించి ఇప్పటి వరకు బీఆరెస్ ప్రభుత్వం ఉద్యోగ నియయమకాలు చేపట్టలేదని తప్పుబట్టారు. దీంతో రాష్ట్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులే 25 లక్షలపైగా పెరిగారన్నారు. నీళ్ల కోసం వెచ్చించిన నిధుల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడడం కాక గోదావరి పై నిర్మించిన ప్రాజెక్టు వలన పేద, మధ్య తరగతి రైతాంగ వ్యవసాయ సాగు భూములకు నీళ్లు అందించలేకపోయారని విమర్శించారు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బడా బడా కార్పోరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, కేసిఆర్ కుటుంబం, వారి ప్రభుత్వంలో కొనసాగుతున్న కొద్ది మంది తాబే దారులు, కలిసి నీళ్లను, నిధులను, భూములను అక్రమంగా కాజేశారని జగన్ ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడి కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరింత ఎక్కువగా దోపిడి జరిగిందని, అందుకే బీఆరెస్ ప్రభుత్వం పై ప్రధానంగా కేసిఆర్, ఆయన కుటుంబంపై అన్ని రంగాల్లో, అన్ని సెక్షన్ ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో రగిలిన ప్రజా వ్యతిరేకత, అసంతృప్తి, కోపం, ఓట్ల రూపంలో కేసిఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడారని జగన్ పేర్కోన్నారు.
బీజేపీతో బీఆరెస్‌కు రహస్య బంధం
మూడవ సారి అధికారం కోసం దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపితో రహస్య రాజకీయ అక్రమ సంబంధాన్ని కలిగి వుండడాన్ని ప్రజా ఉద్యమాలతో చైతన్యమైన సెక్యులర్ ప్రజలు మరింతగా బీఆరెస్‌ను అసహించుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఎన్ని పెట్టినా ప్రజలు ఛీ కొట్టడంతో ఓటమి నుండి తప్పించుకోలేక పోయిందన్నారు. ప్రజా వ్యతిరేక దోపిడి అణిచివేత విధానాలను అమలు చేసినా ఏ పార్టీ అయినా ప్రజా తీర్పుకు చెత్త కుప్పలోకి విసిరేస్తూ వుంటారన్నారు. అయితే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం లేక మార్చి మార్చి అవే పార్టీలను అధికారంలోకి తీసుక రావడం అనేది విషాదకరమన్నారు.
హామీల అమలుకు ప్రశ్నించండి
ప్రజలారా! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హమీలనిచ్చి అధికారాన్ని చేపట్టిందని, ప్రజాస్వామ్యాన్ని గ్యారంటినిస్తామని కూడా హమీనిచ్చిందని జగన్ గుర్తు చేశారు. అందుకే ప్రజల మౌలిక సమస్యలన్నింటిని పరిష్కరించమని అధికార పార్టి కాంగ్రేస్ ను అడగండని, అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్య అవకాశాలను ఉచితంగా కల్పించాలని డిమాండ్ చేయండని జగన్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ప్రెస్ మీట్ లో ప్రజలే పాలకులు, మేము సేవకులం అంటూ కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య పాలన అన్నట్లుగా మాట్లాడారని, ఏ పాలకులైనా ప్రజలను నమ్మించడానికి పడి కట్టు పదాలను వాడుతారు తప్ప ఇందులో ఎంత మాత్రం వాస్తవం వుండదన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్న పాలకులు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారిని నిష్క్రియ ప్రేక్షకులుగానే పరిమితం చేస్తారు తప్ప ప్రజలకు రాజకీయ అధికారంతో ఏ మాత్రం భాగస్వామ్యం వుండదనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌ది ప్రజాస్వామిక పాలనే అయితే ప్రజల ప్రజాస్వామిక రాజకీయ నినాదాలను పరిష్కరించమని ప్రజలు కోరుతున్నారన్నారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలను అడగడమనేది రాజ్యంగం కల్పించిన ప్రాధమిక హక్కు, ప్రజలే పాలకులు అని చెపుతున్న కాంగ్రేస్ పార్టీని ప్రజాస్వామ్యం గురించి అడగాలని సూచించారు. అధికారం చేపట్టిన వెంటనే ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటలీజెన్స్, యాంటి నక్సల్స్ ఇంటలీజెన్స్, ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లో పని చేసి నేరపూరిత అనుభవం కలిగి వున్నా అదనపు డిజీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారంటేనే రేపటి ఉద్యమాలను అణిచివేయడానికే ననేది స్పష్టమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుకుంటున్నారని, ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమవుతుందా? జైళ్ళలో ఏండ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయమని ప్రజల కోరుతున్నారన్నారు. విడుదల చేయగలరా? ప్రజా ఉద్యమకారులపై అర్బన్ నక్సలైట్లు, కలంథారి మావోయిస్టులంటూ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఊపా చట్టం, ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి వాటిని నిలిపి వేయండని, వారిపై ఇప్పటి వరకు పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలన్నారు. ధర్నా చౌక్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్దరించండని, పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని కనీసం చట్టబద్ద పాలన అయినా కొనసాగించమని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ప్రజా సమస్యలు తీర్చాలి
భూమి లేని వారికి భూమి కల్పించాలి, రుణ మాఫీ, రైతు బంధు పేరిట ప్రజా ధనాన్ని భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపి వేసి పేద, మధ్య తరగతి రైతులకు, కౌలు రైతులకు రైతు బంధు వర్తింప చేయాలని జగన్ సూచించారు. రైతు పండించిన పంటలకు మండీలు ఏర్పర్చి న్యాయమైన ధర కల్పించాలని, భూస్వాములకు అనుకూలమైన ధరణీ పోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ, బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలని, ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల నిర్వాసిత సమస్యను పరిష్కరించాలన్నారు. ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి, జల్ జంగల్ -జమీన్ పై పూర్తిగా ఆదివాసులకే అధికారం కల్పించాలని, పెసా చట్టాన్ని, 5వ, 6వ షెడ్యూల్డ్ చట్టాలను, అప్70 చట్టాన్ని, జీవో నెంబర్ 3ని అమలు చేయాలని, ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా ఏర్పరుస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలన్నారు. హరిత హారాన్ని రద్దు చేసి ఆదివాసులపై వున్న కేసులను ఎత్తివేయాలని, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవి హక్కుల చట్టం ప్రకారం లబ్ది దారులకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలని జగన్ కోరారు. ఆర్టీసి ప్రవేటీ కరణను నిలిపి వేయాలని, ఓపెన్ కాస్టులను రద్దు చేయాలని, ఉత్పత్తి రంగాల్లో కాంటాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను, క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. డిపెండెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని, కార్మికుల నిజా వేతనాలు పెంచాలన్నారు. వస్త్ర కార్మికులు, చిన్న తరహా ఉత్పత్తి దారుల హక్కులను, చిన్న తరహా మ్యానుఫాక్చరింగ్ రంగాల హక్కులను కాపాడాలని సూచించారు. కాజిపేట్ లో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ఇవేవో ప్రజలు కోరుకునే గొంతమ్మ కోరికలు కాదని, చట్ట పరిధిలో ప్రభుత్వాలు అమలు చేయాల్సిన న్యాయమైన రాజ్యంగ హక్కులు మాత్రమేనన్నారు. మహలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యవ వికాసం, చేయూత ఆరు గ్యారంటీల ఉచితాలు ప్రకటించారని, వీటి వెనక వున్న ఉచితాల అంతర్యంను మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారి ఆధాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటి ఇవ్వకుండా ఇప్పటికే 5 లక్షల్లో కోట్ట అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఉచిత స్కిమ్ లను అమలు చేస్తామంటున్నారు. వీటికి ఎక్కడి నుండి నిధలు సమకూర్చుతారనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ఇలాంటి పథకాలు చూడడానికి ఆకర్శణీయంగా ఉంటాయి కాని పన్నుల రూపంలో వాటి భారం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రజలపైన్నే వేస్తారన్నారు. ఈ పథకాల నిధుల కోసం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం లేదంటే సామ్రాజ్యవాదుల, దేశ, విదేశ బడా కార్పోరేట్ల వద్ద ఒప్పందాలతో లక్ష కోట్ల రూపాయలు అప్పులు తీసుక రావడం, వారి ప్రయోజనాల కోసం నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం వంటి దోపిడి అణిచివేత విధానాలు రూపొందించి ప్రజల ఆస్తులను, ఖనిజ సంపదలను తెగనమ్మేస్తారని ఆరోపించారు. తద్వారా ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయని, కార్పోరేట్ల దోపిడి ప్రయోజనాలకు ఆటంకంగా మారిన ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకుంటారని, ఇక్కడే ప్రజల ప్రజాస్వామిక హక్కులను, స్వచ్ఛను పాలక ప్రభుత్వాలు చట్టాల రూపంలో కాలరాస్తున్నాయన్నారు. నేటి సమాజం సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జూవా వర్గాల, బడా భూస్వాముల పునాదులపై ఆధారపడి ఈ రాజ్య వ్యవస్థ నిర్మితమై వుండి దోపిడి స్వభావం కలిగి వుంటుందన్నారు. దీంతో అధికారంలోని పాలక పార్టీలు ఎన్ని మారిన వాటి స్వభావం మారదన్నారు. నూతనంగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఏమి అధికారంలోకి రాలేదని, డబ్బు, మద్యంతో ప్రజలను ప్రలోభ పెట్టిన సంగతి జగమెరిగిన సత్యమేనన్నారు. ప్రలోభాలు, అవినీతితో అధికారాన్ని చేపట్టిన పార్టీలు భవిష్యత్తులో ఎంతటి అవినీతికి పాల్పడబోతాయో ప్రజలు అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని ప్రకటించుకుందని, ఇందిర రాజ్యం దోపిడి రాజ్యం అనే విషయం, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందనే విషయం భారత ప్రజలందరికి తెలియంది కాదన్నారు. అందుకే ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజల రాజకీయాధికారం అనేది ప్రజల ప్రత్యామ్నాయం తప్ప మరొక్కటి లేదని జగన్ అభిప్రాయపడ్డారు.