హిందూ ఏక్తా యాత్ర కాదు , ప్రజల చీలిక యాత్ర
హిందూ ఏక్తా యాత్ర కాదు , ప్రజల చీలిక యాత్ర
మొన్న మే 14 న కరీంనగర్ లో
హనుమాన్ జయంతి పేరు మీద బిజెపి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించింది . ఇది ఏదో మామూలుగా ప్రతి సంవత్సరం హిందువులు జరుపుకునే పండుగ లాంటిది కాదు
. బోనాల జాతర లాంటిది మాత్రం అసలే కాదు
. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బిజెపి హిందూ మత పండుగ పేరుమీద మతతత్వ విద్వేష చీలిక రాజకీయాల కొరకు ఈ యాత్రను నిర్వహించారు
. అన్ని ప్రధాన పత్రికలలో హిందూ యాత్ర ఏకత
యాత్ర గురించి మొదటి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు . గతంలో ఎప్పుడూ ఇలా జరిగినట్లు
లేదు , బహుశా ముందు , కర్ణాటకలో విజయం లభిస్తుందనే
అంచనాతో ఆ ప్రభావాన్ని తెలంగాణాలో సమర్థవంతంగా
వాడుకోవడం కొరకు ఈ యాత్రను రూపొందించి ఉంటారు . ఇప్పుడు కర్ణాటకలో పరాజయం పాలు కాగానే ఈ ఏక్తాయాత్రను
ఆ ఓటమి ప్రభావం నుండి కాపాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నట్లు
కనిపిస్తున్నది . అయితే గెలిచినా ఓడినా ఈ హిందూ ఏక్తా యాత్ర
ఉద్దేశం మాత్రం మతతత్వ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను చీల్చడమే .
బండి సంజయ్ మొండి
అబద్ధాలు
ఈ హిందూ ఏకతా యాత్రకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత
బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా వచ్చాడు . కేరళ స్టోరీ సినిమా కు చెందిన వారు కూడా
రావాల్సి ఉండగా రాలేదు . అయితే అసలు ముఖ్యమైన ఆకర్షణ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు
బండి సంజయ్ గారే . వివాదాస్పద వ్యాఖ్యలకు , విచిత్ర మైన
ప్రకటనలకు బండి సంజయ్
పేరుప్రఖ్యాతులు గాంచిన వారు . రాజకీయ , ఆర్థిక , సామాజిక , చరిత్ర విషయాల లో అవసరమైన
పరిజ్ఞానం లేని నాయకుడు బండి సంజయ్ . తెలంగాణ బీజేపీ చరిత్రలోనే ఇంత
తక్కువ విషయ పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి బిజెపి అధ్యక్షుడు అయ్యాడు . బహుశా అటువంటివారు అయితేనే అబద్ధాలు అలవోకగా చెప్ప గలరని
, అటువంటి వారిని అధ్యక్షులు చేస్తున్నట్లుంది ఆర్ఎస్ఎస్ . ప్రక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా సోము వీర్రాజు సేమ్
టు సేమ్ , ఒక యాస తప్ప . వీరు ఏమి
మాట్లాడుతున్నారో వారికే తెలియదు . పైనుండి ఏది చెబితే అదే
విషయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా జనానికి బాగా నటిస్తూ మరీ
చెప్పేస్తారు . విషయ అవగాహన ఉన్నవారు అబద్ధాలు ఆడితే ఊరికే తెలిసి పోతుంది . కానీ వీరు మాత్రం అబద్ధాలను
పూర్తిగా నమ్మి , నమ్మకంగా ప్రచారం చేస్తారు . ఈ హిందూ “ఏక్తా యాత్ర” లో
కూడా బండి సంజయ్ అబద్ధాలు అంటే మామూలు అబద్ధాలు కాదు పూర్తిగా పచ్చి అబద్ధాలు
చెప్పాడు
కర్ణాటకలో ఎందుకు
ఓడిపోయారట ?
ఈ “ఏక్తా యాత్ర
“ లో బండి సంజయ్ చెప్పినది ఏమిటంటే కర్ణాటకలో ఓడిపోయినా వారి ఓటు శాతం ఏమి తగ్గలేదట . కావున అది ఓటమి కాదని అర్థం
అన్నమాట . అసలు 2018 కర్ణాటక ఎన్నికలలోనే BJP కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ
శాతం (36 శాతం-38 శాతం) ఓట్లు వచ్చాయి . కర్ణాటకలో ఇతర పార్టీల శాసన సభ్యులను “చేర్చుకోవడం”
ద్వారానే అప్పుడు BJP దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చింది . ఆ విషయం బండి సంజయ్ మరిచి
పోయాడా ? BJP అప్పుడూ ఓడిపోయింది ఇప్పుడూ ఓడి పోయింది . కాకపోతే ఈ సారి కర్ణాటక ఓటర్లు
, ఇతర పార్టీల MLA లను కొనే అవకాశం BJP కి ఇవ్వలేదు . ఇంకా
కాంగ్రెస్ కు ఓటు శాతం పెరిగిందట అందుకే గెలిచారని అన్నాడు . అయితే అసలు మలుపు , మెలిక
ఏమిటంటే కాంగ్రెస్ కు ఓటు శాతం ఎలా పెరిగింది అనేది . ముస్లింలు క్రైస్తవులు కట్టకట్టుకుని కాంగ్రెస్ కు
ఓటు వేశారట . అంతేకాదు ముస్లింలు క్రైస్తవులు ఐక్యంగా ఉండటం
వల్లనే , హిందువులు ఐక్యంగా లేకపోవడం వల్లనే బిజెపి
ఓడిపోయిందనే అర్థంలోనే సంజయ్ ఉపన్యాసం కొనసాగింది . చివరికి కర్ణాటకలో జరిగిన ఓటమిని కూడా మతతత్వానికి
ముడి పెట్టాడు . మొన్న రాత్రి ఆజ్ తక్ అనే హిందీ సోకాల్డ్ నేషనల్ ఛానల్ లో కూడా ఇదే కథను
వండి వార్చినారు . ముస్లింలు క్రైస్తవులు ఐక్య మయ్యారు కాని హిందువులు ఎనిమిది భాగాలుగా విడిపోయారని కథ చెప్పింది ఆజ్ తక్ . అదే
కథను బండి సంజయ్ ఇక్కడ వినిపించాడు . ఇక ఇప్పుడు భారత దేశమంతటా ఈ
కథే తిరుగుతది అన్నమాట . ముస్లింలు క్రైస్తవుల వలనే కర్ణాటకలో హిందువుల బిజెపి ఓడిపోయిందని
తాలింపు వేసిన
మరో అబద్ధం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ
గెలవగానే కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారని ఎటువంటి జంకు
గొంకు లేకుండా అబద్ధం ఆడేసాడు సంజయ్ గారు . ఎవరు ఎక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అన్నారని
నిర్దిష్టంగా చెప్పకుండానే పాకిస్తాన్ జిందాబాద్ అన్నారన్నో , పాకిస్తాన్ జిందాబాద్ అన్నారన్నో అంటూ పదే పదే చెప్పుకొచ్చాడు
. నిర్దిష్టంగానూ చెప్పలేదు తను చెబుతున్న
దానికి ఆధారాలు ఏమిటి అనేది అసలు చెప్పలేదు . పాకిస్తాన్
జిందాబాద్ అన్నారంటూ రెచ్చగొట్టడం మాత్రం చేశాడు . అసలు విషయం ఏమిటంటే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు కర్ణాటకలో బిజెపి ఓడి
పోయేసరికి ఒక ఫేక్ వీడియోను సృష్టించారు
. ఫ్యాక్ట్ చెక్ లో ఆ
వీడియో ఫేక్ అని కూడా తేలింది . అయితే బిజెపి ఇటువంటి ఫేక్
వీడియోలను సృష్టించడం మొదటిసారి ఏమి కాదు . చివరిసారి అంత
కంటే కాదు . ఎక్కడైతే బిజెపి ఓడిపోతుందో అప్పుడు ఇటువంటి బూటకపు
వీడియోలు సృష్టించి తమ ఓటమిని కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి BJP ఉపయోగించుకుంటున్నది . ఇక గెలిచినవారు ముస్లిం
అభ్యర్థులైతే తప్పకుండా పాకిస్తాన్ జిందాబాద్ వీడియోలు సృష్టించబడతాయి . ఒక్క కర్ణాటకనే కాదు , మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్ , బీహార్ లలో
కూడా పాకిస్తాన్ జిందాబాద్ వీడియోలు సృష్టించబడ్డాయి . మొన్ననే ఉత్తర్ ప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బారాబంకీ నుండి
సమాజ్ వాది పార్టీకి చెందిన ముస్లిం అభ్యర్థి గెలిచాడు
. అంతే “పాకిస్తాన్ జిందాబాద్” వీడియో ప్రత్యక్షమైంది . అదే పాత అబద్ధాన్ని అట్లన్నరన్నో ఇట్లన్నరన్నో అని తాలింపు వేసి మరీ చెప్పాడు బండి సంజయ్
. BJP తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే , అబద్దాలతో కొంతకాలం కొంత మందిని మాత్రమే నమ్మించగలరు
కాని ఎల్ల కాలం అందరిని నమ్మించడం మోసం చేయడం సాధ్యం కాదు . దానికి సాక్ష్యం , ఉదాహరణ కర్ణాటక ఎన్నికల ఫలితాలే
. 2018 నుండి కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్
వీడియోలు వైరల్ చేస్తున్నప్పటికీ బీజేపీ ఓడిపోక తప్పలేదు . ఇటువంటి ఫేక్ వీడియోలే
కాదు తను ఓడిపోయిన దగ్గర మతకలహాలను కూడా సృష్టించి హింసాత్మక చర్యలను ప్రొత్సహించ గలదు
. ధిల్లీ ఎన్నికలలో BJP ఓడిపోయిన తరువాత ధిల్లీలో మతకలహాలు జరిగాయనే విషయాన్ని అన్ని
పార్టీలు గుర్తుంచుకోవాలి .
హిందూ “ఏక్తా
యాత్ర” అసలు లక్ష్యం ఏమిటి ?
అసలు హిందువులు అంటే ఎవరు అనే
దానికి బిజెపి గాని దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కానీ ఎప్పుడూ సరిఅయిన జవాబులు చెప్పలేదు . డొంకతిరుగుడు సమాధానాలు పరస్పర వైరుధ్యం పూరిత సమాధానాలే చెప్పారు
. నిజానికి ఈ హిందూ ఏక్తా యాత్ర ఉద్దేశం హిందువులను ఐక్యం చేయడం
కాదు . పరమైనది కూడా కాదు . హనుమాన్ జయంతి సందర్భంగా చేసిన ఈ యాత్రలో మతపరమైన ఉపన్యాసాలు కానీ
ధార్మిక ప్రవచనాలు కాని ఎవరు ఇవ్వలేదు . అంతే కాదు ఈ హిందూ ఏక్తా యాత్ర లక్ష్యం , రాజకీయ లక్ష్యమే అని బండి సంజయ్ గారే
స్పష్టంగా చెప్పాడు . . బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడానికి బాలగంగాధర్ తిలక్ వినాయకుని ఉత్సవాల
పేరుతో ప్రజలను ఐక్యం చేశాడట . బిజెపి ఆర్ఎస్ఎస్ లు కూడా
తెలంగాణలో కేసీఆర్ ను అధికారం నుండి తొలగించడానికి హిందూ ఏక్తా యాత్ర పేరుమీద ప్రజలను ఐక్యం చేస్తారట . ఒక మతాన్ని , ఒక దేవుడు జయంతిని తమ రాజకీయ లక్ష్యం కొరకు వాడుకుంటామని
ఎటువంటి జంకు గొంకు లేకుండా బహిరంగంగా చెప్పాడు బండి సంజయ్
. హిందువులం అనుకునేవారు హనుమంతుని భక్తులం
అనుకునేవారు బిజెపి అసలు ఉద్దేశం అర్థం చేసుకోవాలి . హిందూ మతం
, దేవుళ్ళు బిజెపికి రాజ్యాధికారం సాధించి పెట్టే పరికరాలు మాత్రమే
. ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా వీరి అరాచక నిరంకుశత్వాన్ని భారతదేశం అరికట్ట గలుగుతుంది .
కర్ణాటక ఓటమి తరువాత బీజేపీ మతతత్వ
రాజకీయాలను సమీక్షించుకుని పాఠాలు తీసుకునే బదులు మతతత్వ రాజకీయాలను మరింత
ఎక్కువగా దూకుడుగా కొనసాగించాలని చూస్తున్నట్లుంది . ఒకవైపు హిందూ ఏక్తా యాత్ర మరోవైపు కేంద్రంలో బిజెపి తొమ్మిది సంవత్సరాల
ఉత్సవాలు ఉంటే సభలు ఊరేగింపులు చేస్తారట . ఈ జాతరలు అన్ని
హిందూ మతం పేరు మీద మతతత్వాన్ని
రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటారు . ఎవరూ అనుమాన పడవలసిన అవసరం ఏమీ లేదు . ఎందుకంటే అభివృద్దిని చూపించి ఓట్లు అడగడానికి BJP చేసిన
అభివృద్ది ఏమి లేదు . లౌకిక ప్రజాస్వామిక పార్టీలు ఇకనైనా మేలుకొనక
పోతే దేశం మధ్య యుగాలలోకి పోక తప్పదు .