అందరికన్నా భిన్నమైన వాడు ధోనీ

అందరికన్నా భిన్నమైన వాడు ధోనీ

ఫాస్టెస్ట్‌ మైండెడ్‌ ప్లేయర్‌లలో ముందున్నాడు: గ్రేగ్‌ ఛాపల్‌

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని ఫాస్టెస్ట్‌ మైండెడ్‌ ప్లేయర్‌లలో ఒకరిగా ఆస్టేల్రియా గ్రేట్‌ క్రికెటర్‌, గ్రెగ్‌ చాపెల్‌ పరిగణించాడు. అతను నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కారణంగా తోటి ఆటగాళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటాడని చెప్పాడు. ’ఎంఎస్‌ ధోనీతో కలిసి పనిచేశాను. తన ప్రతిభను మెరుగుపరుచుకుని తనదైన రీతిలో ఆడేందుకు అతనే ఉదాహరణ. ధోని తన ప్రారంభ రోజుల్లో విభిన్న రకాల పిచ్‌లపై అనుభవజ్ఞుల ముందు ఆడటం ద్వారా నిర్ణయం తీసుకోవడం. వ్యూహరచనలో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ కారణంగా తోటివారి కంటే భిన్నంగా ఉన్నాడు.ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌ను సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో, జాన్‌ రైట్‌ కోచ్‌లో ప్రారంభించాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌`గ్రెగ్‌ చాపెల్‌ కాలంలో మెరిశాడు. వీరిద్దరి హయాంలో శ్రీలంకపై 183 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత టీమ్‌ ఇండియా కెప్టెన్‌ అయ్యాడు. అతని కెప్టెన్సీలో భారత్‌ 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో 50 ఓవర్ల ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విధంగా అతను మూడు ఎఅఅ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి కెప్టెన్‌ మరియు ఏకైక కెప్టెన్‌ అయ్యాడు.

Relative Post

Newsletter