భారత్‌తో వన్డే సిరీస్‌కు రోచ్‌కు పిలుపు
భారత్‌తో వన్డే సిరీస్‌కు రోచ్‌కు పిలుపు
న్యూఢల్లీ: భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం 15 మందితో కూడిన వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. తొలిసారిగా చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ జట్టుకు కీరన్ పొలార్డ్ సారధ్యం వహిస్తున్నారు. 92 వన్డేలు ఆడిన పేసర్ కీమర్ రోచ్‌కు కూడా చోటు కల్పించారు. 2019లో అతడు చివరి వన్డే ఆడాడు. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ ఎన్‌క్రుమా బానర్, ఓపెనర్ బ్రాండన్ కింగ్ కూడా తిరిగి జట్టులో చేరారు. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరుగుతోంది. వచ్చే నెల 6 నుంచి మూడు వన్డేలు అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తారు. కాగా 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో జరిగే మూడు టీ20లకు విండీస్ జట్టును తర్వాత ప్రకటిస్తారు.