సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేసే పనిలో రోహిత్ శర్మ
సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేసే పనిలో రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రికార్డులు ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అయితే రోహిత్ శర్మ ఓ రికార్డును బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. 2011లో వెస్టిండీస్‌పై 219 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. అతను డిసెంబర్ 2011లో వెస్టిండీస్‌పై 2019 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ 149 బంతులు ఎదుర్కొని 25 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో 2017లో శ్రీలంకపై రోహిత్ అజేయంగా 208 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ ఉన్నాడు. 153 బంతుల్లో 12 సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. అయితే సెహ్వాగ్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు. ఈ విషయంలో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య మూడో స్థానంలో ఉన్నాడు. 2000 సంవత్సరంలో భారత్‌పై జయసూర్య 189 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1999లో న్యూజిలాండ్‌పై 186 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడాడు. సచిన్ తర్వాత వెటరన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ నిలిచాడు. ఈ మ్యాచులో రిచర్డ్స్ 181 పరుగులు చేశాడు.