తమిళ హీరో విక్రమ్‌తో ధోనీ భేటీ

తమిళ హీరో విక్రమ్‌తో ధోనీ భేటీ

ఇద్దరి కలయికపై సర్వత్రా చర్చలు

చెన్నై: ఐపీఎల్‌ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్న చెన్నైసూపర్‌ కింగ్స్‌ సారధి మహేంద్రసింగ్‌ ధోని పని కట్టుకుని మరీ ప్రముఖ తమిళ నటుడు చియాన్‌ విక్రమ్‌ను కలిశాడు. వీరిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ.. కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తుంది. విక్రమ్‌ తాజాగా నటించిన చిత్రం ’మహాన్‌’ ట్రైలర్‌ విడుదల రోజే ధోని.. విక్రమ్‌ను కలవడంతో చిత్ర ప్రమోషన్స్‌ కోసం ప్లాన్‌ ప్రకారమే వీరిద్దరు కలిసి ఉంటారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. విక్రమ్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌విూడియాలో వైరలవుతున్నాయి. కాగా, మహాన్‌లో విక్రమ్‌ తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, ధోని ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ఐపీఎల్‌ మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జట్టు యాజమాన్యంతో చర్చలతో  బిజీగా ఉన్నాడు. వేలానికి ముందు సీఎస్‌కే  ధోని సహా నలుగురు ఆటగాళ్లను డ్రాప్ట్‌ చేసుకుంది. సీఎస్‌కే యాజమాన్యం ధోనిని 12 కోట్లకు డ్రాప్ట్‌ చేసుకోగా,  రవీంద్ర జడేజాను అత్యధికంగా 16 కోట్లకు, మొయిన్‌ అలీని 8 కోట్లకు, రుతురాజ్‌ గైక్వాడ్‌ను 6 కోట్లకు రీటైన్‌ చేసుకుంది. కాగా, బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్‌ 2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

Newsletter