మరోమారు పోలీసాఫీసర్ పాత్రలో నాగ్
మరోమారు పోలీసాఫీసర్ పాత్రలో నాగ్
తమిళ హీరో అజిత్, బోనీకపూర్, హెచ్.వినోద్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ ’నేర్కొండ పార్వై’,
విడుదలకు సిద్ధమైన ’వలిమై’ చిత్రాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఇటీవల ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కూడా
అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను లాక్ చేసే ప్రయత్నంలో దర్శకుడు వినోద్ ఉన్నాడు.
త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అజిత్‌కిది 61వ చిత్రం.
ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో మేకర్స్ ఉన్నారు. దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ మూవీలో ఓ సీనియర్‌పోలీస్ కవిూషనర్ పాత్ర సినిమాకి కీలకమైనదిగా భావిస్తున్నారు. ఆ
పాత్ర కోసం నిర్మాత బోనీ కపూర్‌నాగార్జునను సంప్రదించారట. నాగ్‌కు కథ బాగా నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
నిజానికి ఈ పాత్ర కోసం మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను అనుకున్నారట. అయితే ఫైనల్‌గా
నాగార్జునను ఎంపిక చేశారని తెలుస్తోంది. తమిళ, తెలుగు,
హిందీ భాషల్లో విడుదల కానున్న ఈసినిమాలో ఓ మాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్ర
పోషించబోతున్నారని టాక్. ఇక ఈ సినిమాలో అజిత్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర ధరిస్తున్నారని సమాచారం.