బీమ్లా నాయక్ ప్రివ్యూ చూసిన పవన్-రానా
బీమ్లానాయక్ ప్రివ్యూ చూసిన పవన్-రానా
పవన్‌కళ్యాణ్, రానా తాజాగా ’భీమ్లా నాయక్’ మూవీ ప్రివ్యూ చూసినట్టు విూడియాలో ఓ వార్త వచ్చి వైరల్‌అవుతోంది. సాగర్‌కె చంద్ర దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్ ’భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఈ నెల 25న లేదా ఏప్రిల్1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా ఫిబ్రవరి 25నే భారీ స్థాయిలో రిలీజ్‌చేసేలా మేకర్స్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ’భీమ్లా నాయక్’ చిత్రాన్ని ప్రదర్శించగా.. చిత్రబృందంతో కలిసి హీరోలు పవన్, రానా వీక్షించినట్టు సమాచారం. సినిమా పవన్‌కు బాగా నచ్చిందని, అవుట్‌పుట్ పట్ల ఆయన ఎంతో సంతృప్తిగా ఉన్నట్టు చాలా ఎగ్జైట్ అవుతూ భారీ హిట్ ఖాయమని మేకర్స్‌తో చెప్పినట్లు సమాచారం. దీంతో దర్శక, నిర్మాతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌సాధించిన ’అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా రూపొందిన ’భీమ్లా నాయక్’ ఇక్కడ ఎలాంటి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సితార ఎంటర్‌టైనెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందివ్వగా..ఎస్‌ఎస్‌థమన్ సంగీతం అందిస్తున్నారు. నిత్యా విూనన్, సంయుక్త విూనన్ హీరోయిన్స్‌గా నటించారు.