పాన్‌ ఇండియా లెవల్లో శాకుంతలం

పాన్‌ ఇండియా లెవల్లో సమంత-శాకుంతలం

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ’శాకుంతలం’ పాన్‌ ఇండియన్‌ రేంజ్‌లో పలు భాషలలో రిలీజ్‌ చేయనున్నారు. పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ’శాకుంతలం’ షూటింగ్‌ ముగించుకొని పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్ ను జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇందులో సమంత టైటిల్‌ రోల్‌ పోషించగా, ఆమెకు జంటగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కనిపించబోతున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ చైల్డ్‌ ఆర్టిస్ట్ గా ఈ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇస్తోంది. మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత ’శాకుంతలం’ చిత్రాన్ని అక్కడ భారీగా ప్రమోషన్స్‌ నిర్వహించి అంతే భారీ స్థాయిలో రిలీజ్‌ చేయడానికి గుణ శేఖర్‌ బృందం ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో సమంతకు బాలీవుడ్‌లో క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం. దిల్‌ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. గత ఏడాది ’ది ఫ్యామిలీ మేన్‌ సీజన్‌ 2’తో సమంత డిజిటల్‌ ఎంట్రీతో పాటు బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఈ వెబ్‌ సిరీస్‌తో సమంతకు హిందీ ప్రేక్షకులలో మంచి క్రేజ్‌ వచ్చేసింది. ప్రస్తుతం హిదీలో కొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

Newsletter