’రావణాసుర’ సినిమాతో మాస్ మహారాజా
’రావణాసుర’ సినిమాతో మాస్ మహారాజా
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ’ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర’ చిత్రాలతో పాటు ’టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు. వీటిలో ’రావణాసుర’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ’స్వామిరారా, దోచేయ్, కేశవ, రణరంగం లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించిన సుధీర్‌వర్మ దీనికి దర్శకుడు. గ్రే షేడ్స్ కలిగిన పాత్రలో రవితేజ నటిస్తుండగా.. రామ అనే పాత్రను యంగ్ హీరో సుశాంత్ పోషిస్తున్నాడు. మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ, దక్షా నగార్కర్ కథానాయికలుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మాణంలో సినిమా రూపుదిద్దు కుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రవితేజ మొదటి రోజు షూటింగ్‌పై సూపర్ ఎగ్జైట్ అవుతూ ’రావణాసుర’ టీమ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ విూడియాలో షేర్ చేశారు. ఫరియా అబ్దుల్లా, దర్శకుడు సుధీర్‌వర్మ తదితరులు ఫోటోలో కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో రవితేజ డాన్‌గా అలరించబోతున్నారు. ’డిస్కోరాజా’ చిత్రంలో ఈ తరహా పాత్రనే చేసిన రవితేజ ఆ సినిమా రిజల్ట్‌తో నిరాశచెందారు. ఇప్పుడు ’రావణాసుర’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఏ స్థాయి సక్సెస్ అందిస్తుందో చూడాలి.