కొరటాల శివతో ఎన్టీఆర్‌తదుపరి సినిమా

కబడ్డీ నేపథ్యంలో ఎన్టీఆర్‌తదుపరి సినిమా

యంగ్‌టైగర్‌యన్టీఆర్‌తాజా చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌ను మార్చ్‌25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌ప్రకటించిన సంగతి తెలిసిందే. తదుపరిగా తారక్‌.. కొరటాల శివతో 30వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమై.. ఆపై రెగ్యులర్‌ షూటింగ్‌కూడా మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. తారక్‌ మరో సినిమాని కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఉప్పెనఫేమ్‌ బుచ్చిబాబు సాన ఈ సినిమాకి దర్శకుడుగా ఖరారు అయినట్లు సమాచారం. స్పోర్ట్స్‌బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్‌ స్టోరీ ఇంప్రెసివ్‌గా ఉండడంతో యన్టీఆర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త అభిమానుల్ని ఊరిస్తోంది. ఈ సినిమాతో తారక్‌ కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సినిమా ఉంటుందట. యన్టీఆర్‌ మార్క్‌ యాక్షన్‌ ఉంటూనే ఎమోషనల్‌వేలో  కథ సాగుతుందట. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. మార్చ్‌లో కొరటాల శివ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్ళనుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను లాక్‌ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇదివరకు కబడ్డీ నేపథ్యంలో వచ్చిన కబడ్డీ కబడ్డీ, ఒక్కడు, సీటీమార్‌చిత్రాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Newsletter