మార్చి-8న అంతర్జాతీయ మహిళ దినం
అంతర్జాతీయ మహిళా దినం అంటే చరిత్ర నిర్మించిన సాధారణ మహిళ చరిత్ర.
మార్చి-8న అంతర్జాతీయ మహిళ దినంగా ప్రతిపాదించిన అంతర్జాతీయ కమ్యూనిస్టు మహిళ ఉద్యమ నాయకురాలు క్లారా జెటికిన్ గురించి తెలుసుకోవడం, తెలియజేయడం అత్యంత అవసరం.
"ఇక మీదట యుద్దాలు వద్దు" అనే క్లార ఆఖరి సందేశాన్ని నెరవేర్చాల్సిన కర్తవ్యం నేటి మహిళల మీద ఉంది.కానీ ఇవాళ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను ప్రభుత్వాలు, ఎన్జీవోలు దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నిజమైన ఆనందం విజయం లొనే వుంటుంది వాస్తవమే కానీ రమిజాబి,సంగీతశర్మ,ప్రతిమ, శ్రీలక్ష్మీ నుంచి ..... ఎందరో అభయలు,నిర్భయలు....
స్రుసృత,రవళి నేటి భవ్య,వైష్ణవిల ఉదంతాలు నేటికి జరుగుతుంటే ప్రేమించకపోతే యాసిడ్ ,పెట్రోల్ పోయాడలు అందరి దృష్టి కి వచ్చినవి కొన్ని మాత్రమే. రిపోర్ట్ కానివి,లోకల్ గా రిపోర్టు ఐ ప్రపంచ దృష్టి కి రానివి ఎన్నో ..చర్చ కు,దృష్టికి రానివి ఎన్ని కేసులో!
ప్రతిరోజు స్త్రీల మీద హింస పెరిగిపోతోంది నిజం కదా. ఎందరో స్త్రీలు చనిపోతున్నారు లేదా చనిపోతామని భయంతో బతుకుతున్నారు.అనేక మంది మహిళలు మానసిక జబ్బులకు గురౌతున్నారు. వీటికి పైకి కనిపించే కారణాలు ఏవైనా హింస మాత్రం వీటన్నింటినీ ఆవరించి ఉన్న తరుణంలో సెలెబ్రిట్ చేసుకోవడమంటే అర్థం లేనివే. సెలబ్రెషన్లు మహిళలు గా మనము లక్ష్యాన్ని నిర్వచించుకునే వేళలుగానూ,మన పురోగతి ని సమీక్షచుకునే సందర్భాలుగా మారాలి కానీ వంటల పోటీలు, ప్యాషన్ షోలతో మరేదైనా ఎంజాయ్ చేసే సందర్భాలుగా కాకూడదు.
ప్రధానంగా ఇవాళ స్త్రీలపై హింస నాలుగు రకాలుగా చెప్పవచ్చు. కుటుంబ హింస, లైంగిక హింస, రాజకీయ పరమైన హింస, రాజ్యహింస. ఈ హింస నాలుగు గోడల మధ్యన, సమాజంలో,కమ్యూనిటీ లో, రాజ్య యంత్రాంగం లో ఎక్కడైనా జరుగుతోంది. ఈ నాలుగు చోట్ల ఒకదానితోటి ఒకటి సంబంధము ఉన్నవే. ఆ సంబంధము మరింత పెరిగి దానికి సాంఘిక ఆమోదం కూడా దొరుకుతోంది. స్త్రీలను లైంగికంగా, మానసికంగా హాని చేయడం, భాదించడము,హాని చేస్తామని,భాదిస్తామని బెదిరించడము,బలవంతం చేయడము,వాళ్ల స్వేచ్ఛ ను హరించడము,కదలికలను నియంత్రించడము ఇవన్నీ పబ్లిక్ గా జరిగిన, ప్రయివేట్ గా జరిగినా అవి హింస గానే గుర్తించాలి. స్త్రీలు శిశువులుగా,పిండాలుగా ఉన్నప్పుడే హత్య చేయబడుతున్నారు.ఇంకా అనేక లైంగిక వేధింపులకు గురౌతున్నారు. పురుషుడితో మహిళకు ఉన్న సంబంధం వల్ల కుటుంబ హింసకు, వరకట్న మరణాలకు గురౌతున్నారు. అంతే కాకుండా సాయుధఘర్షణలు జరిగిన సందర్భాల్లో మహిళను రేప్ చేస్తున్నారు.స్త్రీలను బలత్కరం చేయడం ద్వారా ఒక కమ్యూనిటిని మొత్తంగా అవమానించవచ్చు అని అనుకుంటున్నది. ఇక్కడ ప్రధానంగా రాజ్య స్వాభావాన్ని ,కుట్రలను పసి గట్టాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్నప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు పోరాడుతున్నారు. వారిపై రాజ్యం తీవ్ర నిర్బంధం ను ప్రయోగిస్తోంది. వేలాది మందిని జైల్లోలలో నిర్బంధం కు గురి చేస్తోంది. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న,ఎదిరిస్తున్న ప్రజల పై,ముఖ్యంగా స్త్రీల పై రాజ్యం అత్యాచారాలనే అయుధంగా ఎంచుకుంది. కాస్మిర్, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతం లో అదే దండకారణ్యం లో మహిళల మాన ప్రాణాలను తోడేస్తున్నారు. అది నాటి సమైక్యాంధ్రప్రదేశ్ లో విశాఖ ఏజెన్సీ వాకపల్లి లో గ్రేహౌండ్స్ పోలీసులు గిరిజన మహిళల పై రేప్ చేసిన ఘటన నేటికి పచ్చిగానే ఉంది. ఈ హింసా ప్రపంచమంతా ఉంది. తెలంగాణ రాష్ట్రం లో మావోయిస్టు శృతి పై జరిగిన హింసా అయితే ఒక ప్రతి ఘటన రూపమే తీసుకొని పొరాటమైన ఘటన ప్రపంచమంత తెలుసు. ఈ హింస నేడు ఒక పాలసిగానే కొనసాగుతోంది. ఇది దేశమంతా అనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. బాల్యం నుంచే పిల్లల్లో స్త్రీ, పురుషులు సమానమనే భావన కల్పించే లా విద్యా బోధన ఉండాలికానీ ఇవాళ అమ్మ వంట చేస్తుంది. నాన్న ఆఫీసు కు వెళ్తాడు. కాలు మీదా కాలు వేసుకొని పేపర్ చదివినట్లు, పిల్లలు అడుకున్నట్లు పాఠ్యపుస్తకాలలో వుంటున్నాయి. వివక్షత లేని చదువును అందించేందుకు పోరాడాల్సిన అవసరం ఉంది.
మహిళలు కూడా నిర్భయ చట్టాన్ని, లింగ నిర్ధారణ పరీక్షలు నిరోధించే చట్టాన్ని,ఆస్తి హక్కు చట్టాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి. వీటి ద్వారా ఇప్పటి వరకు ఉపయోగించుకొని వారు ఉపయోగించుకుంటే తమ జరుగుతున్న హింస ను కొంత మాత్రమైన నిరోధించుకొవచ్చు.
ఇప్పటి వరకు పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం కోసం దశాబ్ధాలుగా పొరాడినా ఎన్నో మెలికలతో ఆమోదం పొందినప్పటికీ 2029 వరకుఅది అమల్లోకి వచ్చే అవకాశం లేదంటే భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ పురుషాధిపత్యం కలిగి ఉన్నాయనే అర్ధం చేసుకోవాలి. మహిళా సంఘాలు గా ఈ రాజ్య హింసను, అన్ని రకాలుగా మహిళల పై జరుగుతున్న హింస లను ప్రతిఘటించేందుకు,ఎదిరించేందుకు చైతన్యం పొందటానికి ఇవాళ ఆడపిల్లలను చదివించడము ఎంత మాములైన విషయమైనప్పటికీ ఆ పిల్లల మీద పోలీసింగ్ ను ఆపలేకపోతున్నాము. ఆడ పిల్లలు స్వేచ్ఛ గా సంచరించేందుకు అవసరమైన భద్రతా వాతావరణం ను కల్పించాలని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మహిళా సాధికారత, మహిళా స్వతంత్రము అంటూ ఆకర్షణీయమైన మాటలను వల్లిస్తున్న పాలకులు మరొక వైపు మహిళల పట్ల సమాజ దృక్పథం కించిత్ మాత్రం కూడా మారకుండా ఉండేందుకు తగిన భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు దీనిలో భాగంగానే బతుకమ్మ, సమ్మక్క,సారక్క, మైసమ్మ,దుర్గమ్మ,లక్ష్మీ, సరస్వతి, పార్వతి, రాజేశ్వరి, సీతా వంటి దేవతలకు పూజలు చేస్తారు, పండుగలు చేస్తారు. దేవతలపేర్లు పెట్టుకుంటరు. కానీ సమాజంలో ,నిజజీవితాల్లో మాత్రం మహిళలు దేవతల్లా కాకుండా కనీసం మనుష్యుల వలె కూడా చూడబడ్తలేరు.
గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా మహిళలు అనేక రకాల హింసలకు, అనేక విధాల వేధింపులకు గురౌతున్నారు. ఏ దేవుళ్ల కు పూజలు చేసినా మహిళల సమస్యలు మారడం లేదు. దేవుళ్ళ కు.మొక్కితే ఏ సమస్య పరిష్కారం కానేకాదు. చైతన్య వంతంగా , శాస్ర్తీయంగా ఆలోచించి కార్యాచరణకు దిగాలి. ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా,శారీరకంగా మహిళల్ని సర్వ నాశనము చేస్తున్నారు. భూస్వామ్య, రాజరిక భావజాలపు అవశేషాల్ని అట్లాగే కొనసాగిస్తూ మహిళలను సేవకులుగా, ఆధునిక బానిసలుగా,పని మనుష్యులు గా,భర్త ల కోరికలు తిర్చే బామాలుగా,పిల్లలను కనెటి యంత్రాలు గా , ఆస్తిపాస్తులపై హక్కులు లేకుండా,తిట్టినా, కొట్టినా అనిగి మణిగి వుండే స్థితి ని కొనసాగిస్తూ మరోవైపు కల్లబొల్లి మాటలతో , పంచ రంగుల ప్రచారాలతో మహిళల సమస్యలు పరిష్కారం చేస్తామని పాలకులు ప్రచార్భాటాలను కొనసాగిస్తున్నారు. దీనికి ఇవాళ కార్పొరేట్ మీడియాను కూడా ఎక్కువగా వాడుకుంటున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి సమాజంలో మౌలిక మార్పులు జరగాలి. మహిళల మీద అమలవుతున్న సమస్త పిడనలకు మూలాలు దోపిడీ సమాజంలోనే ఉన్నాయి. కనుక తమ మీద జరుగుతున్న సమస్త పిడనాలను తొలగించుకోవాడినికి మహిళలు దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం లో సగభాగము కావాలి. అప్పుడే నిజమైన సాధికారత, స్వేచ్ఛ లను పొందగలరు.
----------------బండి.శ్రామిక