శ్రీలంకలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ
కొలంబో: మన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతుంది. మొదట చైనా అప్పుల కారణంగా అణచి వేయబడింది. అనంతరం వచ్చిన కరోనా మహమ్మారి దేశాన్ని మరింత ఇబ్బందిపెట్టింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పిల్లలకు ఒక్కపూట భోజనం దొరకని పరిస్థితి నెలకొంది. దేశంలో ఆహార సంక్షోభం పెరిగిపోయింది. ప్రజలు ఆకలి చావుల బారిన పడుతున్నారు. ఇప్పుడు తల్లులు తమ పిల్లల నుంచి ఉపవాసాలకు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి. శ్రీలంకలో పచ్చిమిర్చి ధర కిలో రూ.700కి చేరుకోగా.. ఒక్క జనవరి నెలలోనే దేశంలో ఆహార పదార్థాల ధరలు 15 శాతానికి పైగా పెరిగాయి. ప్రజలకు ఒక పూట భోజనం కూడా సక్రమంగా అందడం లేదు. దేశంలో పెరుగుతున్న ఆకలి సంక్షోభం కారణంగా అబద్ధాలు చెప్పి తన పిల్లలను శాంతింపజేసినట్లు ఓ ముస్లిం మహిళ తెలిపింది. తిండి దొరక్క ఈ రంజాన్ మాసం గడుస్తోందని, అందుకే అందరం పస్తులుంటున్నామని తన పిల్లలకు చెప్పినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు రంజాన్ మాసం చెప్పి నోరుమూయించాం కాబట్టి.. ఎవరూ ఏమీ అనడం లేదని వాపోయింది. శ్రీలంక మొదట చైనా కుట్రలో చిక్కుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకుంది. కరోనా మహమ్మారి మరింత ఇబ్బంది పెడుతోంది. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టూరిజంపై ఆధారపడి ఉంటుంది. దేశం ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సహాయం తీసుకోవడానికి నిరాకరిస్తోంది.