ఎంపీలతో సిఎం కెసీఆర్‌ భేటీ

ఎంపీలతో సిఎం  కేసీఆర్‌ భేటీ

పార్లమెంటులో వ్యూహంపై చర్చించే అవకాశం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, పలు అంశాలు, అలాగే కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్‌ సమస్యలపై ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ నివేదికలు అందించ నున్నారు. బ్జడెట్‌ సమావేశాల సందర్భంగా తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు కేంద్రంపై పోరాడేందుకు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

Relative Post

Newsletter