రాజీనామా కాదు.. ఓ ఆత్మరక్షణ పత్రం.

రాజీనామా కాదు..ఓ ఆత్మరక్షణ పత్రం.
తప్పును దాచే 'రాజకీయ నాటకం'

ఈ రాజీనామా లేఖ వెనుక ఉన్న అసలు ఆర్. ఎస్. ఎస్ మోహన్ భాగవత్ మాటల్లోనే వారి వ్యూహం మార్చుకున్నట్టు అర్ధమౌతోంది.

ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీలో జెపి నడ్డా వంటి కీలక కోర్ లో భాగం.ఆర్ ఎస్ ఎస్ తో కలసి చేస్తున్న విధ్యావిధాన పాలసీమెకర్ లో ఒకరు.
ఇప్పటిదాక దూకుడుగా తీసుకోస్తున్న విధానాల ఫలితాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతనను సో కాల్డ్ పార్లమెంటరీ పార్టీల బలహీనతల కారణంగా వాటిని లెక్కచేయని స్థితి ఒకటి. ఇలా ఒక క్లౌడ్ బరస్ట్ లాంటిది ఇలా వస్తుందని వూహించిన రెగ్యూలెట్ చేయగలమనే ఒక అతి విశ్వాసం వారిలో మెండుగా ఉన్న స్థితి.
ఇక్కడ నష్ట నివారణ నేరెటివ్ ఒకటి బిల్డ్ చేయాల్సిన అవసరం వారికి ఎర్పడింది.
​1. తప్పును దాచే 'రాజకీయ నాటకం' (Absolution over Accountability)
​ఎంతటి తీవ్రమైన వ్యవస్థాగత లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా... పాలకులకు తమ పాలనా వైఫల్యాన్ని, విద్యా వ్యాపారీకరణను ఒప్పుకోవడానికి వారి స్వాభావం అంగీకరించదు.
ఒక మంత్రి రాజీనామా అనేది చారిత్రకంగా "బాధ్యత వహించడం" అనే సూత్రానికి సంకేతం. ఇది జనరల్ సూత్రీకరణ.
కానీ, ఇక్కడ విద్యాశాఖ మంత్రి తన రాజీనామాను ఒక "త్యాగం"గా, "జాతి ప్రయోజనాల కోసం వేసిన అడుగు"గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం.
ఇది రాజీనామా లేఖ కాదు తన వర్గ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాసుకున్న ఓ ఆత్మరక్షణ పత్రం.
​2. ఉద్యమానికి జాతిద్రోహం రంగు రుద్దే కుట్ర
(Delegitimizing the Class Struggle)
​రాజకీయ అధికారం తన ఉనికి ప్రమాదంలో పడినప్పుడు ఎల్లప్పుడూ వాడే పాత ఆయుధమే — "జాతి ఐక్యత ప్రమాదంలో ఉంది" అనే నినాదం.
​విద్యాహక్కు కోసం, పారదర్శకమైన పరీక్షల కోసం, రేపటి భవిష్యత్తు కోసం పోరాడుతున్న జెన్ జీ, విద్యార్థి లోకం వారి ఆకాంక్షలను .
బేస్ ను చూడనీరకరిస్తూ... వారి ఉద్యమాన్ని "జాతి ఐక్యతను భగ్నం చేసేదిగా" ప్రాపగండ చేయడం కూడా వారి వ్యూహత్మక డిఫెన్స్ ఆర్గ్య్.
​శ్రామిక, మధ్యతరగతి పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్న విద్యా విధానాన్ని ప్రశ్నిస్తే, ఆ నిరసనను "తప్పుదారిన పట్టిన ఉద్యమం" ఇది డీప్ స్టేట్ కుట్ర అని.. ఇంకొక ముద్రవేయడం పాలకుల నైజం. ఇది స్పష్టంగా ప్రజాస్వామ్య బలాన్ని నైతిక దెబ్బ తీసే ప్రయత్నం.వారి నైజం..
​3. జులై 20 ప్రభుత్వ దమనకాండ & అణచివేత
​సమస్యను పరిష్కరించాల్సిన రాజ్యం... శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై, విద్యార్థులపై చర్చలకు పిలుస్తునే మరో పక్క జులై 20న దమనకాండకు దిగింది. విద్యార్థుల రక్తాన్ని, ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను దాచిపెట్టి, పోరాడే వాళ్లనే "శాంతిభద్రతల శత్రువులు"గా ఆంటి నేషన్ గా, డీప్ స్టేట్ కుట్ర అని చూపించడం పక్కా ఆర్ ఎస్ ఎస్ , బూర్జువ వ్యవస్థాగత హింస (Systemic Violence).
​4. వివేకవంతమైన పౌరసమాజం ముందున్న కర్తవ్యం
​ఈ రాజీనామా లేఖలోని ప్రచ్ఛన్న స్వరం (Tone) స్పష్టంగా చెబుతోంది: అధికార పీఠం దిగివచ్చినా, స్టేట్ నిర్బంధ వైఖరి ఇంకా మారలేదని స్పష్టం.
​రాజీనామా అనేది విజయమే. కానీ ఇక్కడితోనే ఆగిపోవడం కాకుండా వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రశ్నించే గొంతులు మరింత బలపడాలి.
​పాలకుల నకిలీ జాతీయవాద ముసుగును తొలగించి, విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజాస్వామిక పోరాటాన్ని సామాజిక-ఆర్థిక హక్కుల సాధన,
పాలసీల పై చర్చ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లడమే నేటి ఏకైక మార్గం.

--బండి.దుర్గాప్రసాద్

Relative Post

Newsletter