ఉప్పోంగిన 'జెన్ జీ' (Gen Z) ఉద్యమం
'జెన్ జీ' (Gen Z) ఉద్యమంలోఉప్పోంగిన యువత చైతన్యం
- ప్రజాస్వామ్య విజయం.
రాజ్యాంగ పరిరక్షణలో నవతరం ఉద్యమ బాట రాజీనామా సాధన : ప్రశ్నించే నైజం, పట్టుదలతో అసాధ్యమనుకున్న ఫలితాన్ని సాధించిన విద్యార్థి శక్తులు. భయపడడం ప్రజాస్వామ్యం కాదు .
"ప్రజాస్వామ్యంలో భయపడటం ఏంటి?" అనే స్పష్టమైన నినాదంతో రోడ్లపైకి వచ్చిన నవతరం.
రాజ్యాంగ మేళవింపు: భారత్ మాతాకీ జై , వందేమాతరం , ఇంకిలాబ్ జిందాబాద్, జై భీమ్ నినాదాలను ఒకే వేదికపైకి తెచ్చి కులమత విభజన రాజకీయాలను పటాపంచలు చేసిన తీరు. సృజనాత్మక ఉద్యమం: వ్యంగ్య ప్లకార్డులు, విద్యార్థినుల విశేష భాగస్వామ్యం, స్వచ్ఛంద మద్దతు. ఆరంభం మాత్రమే :
ఒక విజయం కేవలం ఆరంభం ("లడాయీ షురూ హుయీ" ), ప్రజాస్వామ్య పునాదుల పరిరక్షణే అంతిమ లక్ష్యం. 1. అసాధ్యమనుకున్నదాన్ని సాధ్యం చేసిన యువశక్తి ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రతినిధులు, రాజకీయ విశ్లేషకులు, అనేకమంది నాయకులు "ఈ ప్రభుత్వంలో రాజీనామాలు సాధించడం సాధ్యమా? అటువంటి సంస్కృతి లేదు.. ఆ అవకాశమే లేదు" అని కొట్టిపారేశారు.
కానీ విద్యార్థి నేతలు, యువతీ యువకులు చూపిన నిరంతర పోరాటపటిమ ఆ అంచనాలను తలకిందులు చేసింది. "జుక్తీ హై దునియా, జుకానే వాలా చాహియే..." (ప్రపంచం తలవంచుతుంది, రాజీలేని సమర ఉద్యమకారులుండాలి). సరిగ్గా ఆ సూత్రాన్నే విద్యార్థులు ఆచరణలో చూపించారు.
పాలకుల వద్ద తలవంచని మనస్తత్వమే రాజీనామా సాధనకు పునాదిగా మారింది. 2. "ప్రజాస్వామ్యంలో భయమెందుకు? " –
నవతరం సందేశం ఈ ఉద్యమంలో విద్యార్థులు లేవనెత్తిన అత్యంత స్పష్టమైన ప్రశ్న: "ప్రజాస్వామ్యంలో భయపడటం ఏమిటి?" పాలకులకు, పోలీసులకు లేదా వ్యవస్థకు భయపడి బతకడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు.ప్రజాస్వామ్యం అంటేనే భయం లేకపోవడం, హక్కుల కోసం స్వేచ్ఛగా ప్రశ్నించగలగడం. భయ రహిత వాతావరణంలో మాత్రమే పౌర హక్కులు నిలబడతాయని యువత తమ నిరసన ద్వారా స్పష్టం చేసింది.
3. వైవిధ్యంలో ఐక్యత: విభజన రాజకీయాలపై విజయం గత కొన్నేళ్లుగా సమాజంలో కుల, మతాల పేరుతో సాగుతున్న విభజన రాజకీయాలకు చెక్ పెడుతూ విద్యార్థులు అపూర్వ ఐక్యతను చాటారు. ఒకే వేదికపై నుంచి మ్రోగిన నినాదాలు భారతీయ సమాజపు వైవిధ్యానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి: భారత్ మాతా కీ జై వందేమాతరం ఇంకిలాబ్ జిందాబాద్ జై భీమ్ హిందూ-ముస్లిం విభజనల ద్వారా ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి పోషించే కుట్రలను ఈ నినాదాల సమ్మేళనం తుత్తునియలు చేసింది. దేశభక్తి, విప్లవాత్మక ఆలోచన, సామాజిక న్యాయం మరియు రాజ్యాంగ విలువలు ఒకే ఉద్యమ వేదికపై కలవడం చారిత్రాత్మకం.
4. సృజనాత్మకత, యువతుల పాత్ర & కలెక్టివీటి ఈ పోరాటంలో సాంప్రదాయ ఉద్యమ రూపాలకే పరిమితం కాకుండా యువత చూపిన సృజనాత్మకత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది: సృజనాత్మక నిరసనలు: " PM మోదీ మై ఎక్స్ (My Ex)... గుండె లేని మనుషులు" అంటూ వ్యంగ్యంగా, వ్యూహాత్మకంగా ప్లకార్డులు రూపొందించి ప్రజల్లోకి ఆలోచనలను బలంగా తీసుకెళ్లారు. మహిళా చైతన్యం: అబ్బాయిలతో సమానంగా, అంతకంటే రెట్టింపు సంఖ్యలో విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి పోరాడటం విశేషం. స్పూర్తినిచ్చిన ఉద్యమం; స్వచ్ఛందంగా ఇళ్ల నుంచే తిండి వండుకుని వచ్చి ఉద్యమకారులకు పంచిపెడుతూ కార్యకర్తల పట్టుదలను నిలబెట్టారు.
5. పరిణతతో మాట్లడిన విధ్యార్థులు ఈ ఉద్యమంలో సాధించిన విజయంపై మాట్లాడిన విద్యార్థి నేతలు – "ఈ విజయం మాది మాత్రమే కాదు, భారత రాజ్యాంగానిది" అని ఘంటాపథంగా చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకంటే, రాజకీయ పార్టీలకంటే అత్యున్నతమైనది భారత రాజ్యాంగమేనని పునరుద్ఘాటించారు. "పోరాటం ఇప్పుడే మొదలైంది" "ఏక్ వికెట్ గిర్నా దేవ్... లడాయీ షురూ హుయీ" – ఒక వికెట్ పడటం అంటే మ్యాచ్ పూర్తయినట్లు కాదు; ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ఇది కేవలం ఒక ముందడుగు మాత్రమే. ప్రశ్నించే గొంతుకలు ఉన్నంతకాలం, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని ఈ యువజన ఉద్యమం దేశానికి చాటిచెప్పింది.-- ----బండి.దుర్గాప్రసాద్